TTD Parakamani Case: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) పరకామణి చోరీ కేసులో నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరకామణి చోరీ కేసు నేపథ్యంలో అలాంటివి జరగకుండా మెరుగైన, ప్రత్యామ్నాయ విధానాలపై నివేదిక ఇవ్వాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. నిన్న ( జనవరి 5న) హైకోర్టుకు నివేదిక ఇచ్చిన టీటీడీ.. ప్రత్యామ్నాయ విధానాలను సరిగ్గా నివేదికలో పేర్కొనలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పరకామణిలో భక్తుల కానుకలు పక్కదారి పట్టడం సహించలేమని కోర్టు తేల్చి చెప్పింది.
Read Also: Star Hero : ఒక్క సినిమాకు రూ. 225 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో
ఇక, టీటీడీ పరకామణి చోరీ కేసులో నిందితులతో అప్పటి పోలీసుల పాత్ర ఏంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. అయితే, కొందరు పోలీసులు నిందితుడితో చేతులు కలిపారని న్యాయస్థానానికి ప్రభుత్వం తరపు లాయర్ తెలిపారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఆదాయానికి మించిన ఆస్తులు పరిశీలించాలని సీఐడీని ఆదేశించింది కోర్టు.
Read Also: Suresh Kalmadi: కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత..
అలాగే, భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని ఏపీ హైకోర్టు తెలిపింది. ఈవోతో చర్చించి మరోసారి తెలుపుతామని న్యాయస్థానానికి టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ చెప్పింది. కోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తే అమలు చేస్తామని టీటీడీ పేర్కొనింది. సలహాలు, సూచనలను తెలపకుండా ఏం ఆర్డర్ ఇస్తామని న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.