TTD Alert: వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో భారీ బందోబస్తు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Alert: వైకుంఠ ఏకాదశి–ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి (30-12-2025), వైకుంఠ ద్వాదశి (08-01-2026) సందర్భంగా మొత్తం 10 రోజుల పాటు (డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు) వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని తెలిపారు.
Chennai: పెళ్లై 9 రోజులు కూడా కాకముందే భార్య హత్య, భర్త ఆత్మహత్య..!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనమని మరోమారు గుర్తు చేశారు. ఆన్‌లైన్ ద్వారా సుమారు 25 లక్షల మంది భక్తులు దరఖాస్తు చేయగా, ప్రతిరోజు 60,000 టోకెన్లు చొప్పున దర్శనాలు కేటాయింపు జరిగింది. భక్తుల రద్దీ నియంత్రణ కోసం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, క్యూలైన్ నిర్వహణ, నిఘా చర్యలు ముందస్తుగా అమలు చేయనున్నారు.
Cigarette prices: రూ. 18 నుంచి రూ. 72కి పెరగనున్న సిగరెట్ ధరలు.?
ఇంకా టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహణ చేస్తున్నారు అధికారులు. ఈ సందర్బంగా భక్తులకు పలు సూచనలు చేశారు. భక్తులు క్రమశిక్షణతో, సౌమ్యంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలు, వృద్ధులు, విలువైన ఆభరణాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?