తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సులేఖలకు అనుమతిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారానికి రెండు... రూ.3 వందల దర్శనానికి సిఫార్సులేఖలకు ఏపీ సీఎం అనుమతించారు.. దీంతో.. టీటీడీ, సీఎం చంద్రబాబు.. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పినట్టు అయ్యింది..
బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిల్ల శ్రీధర్ బాబు,…
Srinivas Goud : తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్షలు మంచివి కావని, తెలంగాణ ఆలయాల్లో అందరినీ సమానంగా చూసే విధానాన్ని గుర్తుచేశారు. తిరుమలలో కూడా ఇదే నిబద్ధత ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం గద్వాల నియోజకవర్గంలోని జములమ్మ అమ్మవారిని శ్రీనివాస్ గౌడ్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం గద్వాల బీఆర్ఎస్ నాయకుడు బాసు హనుమంత నాయుడు…
Tirumala Special Days 2025: జనవరి మాసంలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. తేదీల వారీగా పూర్తి వివరాలను తెలిపింది.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ఇక, క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి.. వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తుల సర్వ దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది. Read Also: PSLV-C60 Rocket: రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్..…
తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్న్యూస్ చెప్పింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నపై టీటీడీ ఈవో శ్యామల రావు గతంలో స్పందించారు.
2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనంపై అధికారులతో సమీక్షించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఉన్నాయని.. మొత్తంగా 91 కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని బుధవారం ఓ ప్రకనలో చెప్పారు. జనవరి 10, 11, 12వ తేదీలకు గాను 9వ తేదీన ఉదయం…
23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 18 వందల చొప్పున 10 రోజులకు సంబంధించి 18 వేల టికెట్లను విడుదల చేయగా.. పదివేల 500 విలువచేసే శ్రీవాణి టికెట్లను భక్తులు గంటన్నర సమయంలోనే కొనుగోలు చేసేశారు. ఇక, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి పది రోజులకు సంబంధించి 1,40,000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయగా కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని కొనుగోలు చేసేశారు. లక్షా 40…
భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఫీడ్బ్యాక్ వ్యవస్థ.. టీటీడీ కీలక నిర్ణయాలు టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రతి రాష్ర్ట రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. స్విమ్స్ హస్పిటల్కు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని…