తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. అంబులెన్సులలో మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఓ అధికారిని కూడా పంపుతున్నారు. కాగా.. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మంత్రులు అనిత.. ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్ రుయా ఆసుపత్రిలోని మార్చరీ వద్దకు చేరుకున్నారు. రుయా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. కలెక్టర్, ఎస్పీ ఘటన అంశాన్ని మంత్రులకు వివరించారు. మరోవైపు.. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
READ MORE: Antony Blinken: గ్రీన్‌ల్యాండ్ విలీనం జరిగే ఛాన్స్ లేదు.. ట్రంప్ మాటలు పట్టించుకోవద్దు..!
ఇదిలా ఉండగా.. జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నివేదిక సమర్పించారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగ్గా స్పందించలేదని కలెక్టర్ రిపోర్టులో పేర్కొన్నారు. ” సమాచారం అందుకున్న ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చారు. భక్తులకు సాయం చేశారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు’’ అని నివేదికలో వెల్లడించారు.
READ MORE:Los Angeles Wildfires: హాలీవుడ్ హిల్స్‌లో కార్చిచ్చు.. ఆస్కార్ వేదికకు పొంచి ఉన్న ముప్పు!