ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు. మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చారు. “చిన్న చిన్న దెబ్బలు తగిలిన అందరూ కోలుకుంటున్నారు.. ఒక వ్యక్తి కి ఫాక్చర్ గాయాలు ఉన్నాయి.. తొక్కిసలాట లో ఐదుగురు చనిపోయారు.. క్యూ లైన్ లో అస్వస్థత కు గురై ఒకరు చనిపోయారు.. మృతి చెందిన ఆరుగురు మినహా , తీవ్ర గాయాలు ఎవరికి లేవు.. స్విమ్స్ లో 29 మంది కి ఇప్పటికీ చికిత్స అందిస్తున్నారు.. జరిగిన ఘటన వెనుక ఎవరి నిర్లక్ష్యం ఉన్నా కఠిన చర్యలు ఉంటాయి..” అని పేర్కొన్నారు.
READ MORE: Kangana Ranaut: రాహుల్‌పై విమర్శలు.. ప్రియాంక గాంధీపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎంపీ కంగనా
ఇదిలా ఉండగా.. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. 41 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తేలినట్లు చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
READ MORE: Nidhhi Agerwal : సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టిన నిధి అగర్వాల్
“ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి చికిత్స జరుగుతోంది.” అని వెల్లడించారు. ఇదిలా ఉండగా..మంత్రులు అనిత.. ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్ రుయా ఆసుపత్రిలోని మార్చరీ వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులను కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు వారికి వివరించారు. బాధితులను మంత్రులు పరామర్శించారు. కుటుంబీకులను కోల్పోయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.