RK Roja: తిరుపతి ఘటనపై స్పందించిన రోజా.. పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు..
- తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం
- చంద్రబాబు అసమర్థత వల్లే ఘటన
- సనాతన యోధుడు పవన్ ఎక్కడ?
- ఇప్పుడు ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశామని మాజీ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శిచారు.. ఘటనకు కారణమెవరో కనుక్కోకుండా నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.. అధికారులను, టీటీడీ బోర్డును ఎవరు పెట్టారని ప్రశ్నించారు.. భక్తులకు సర్వీస్ చేయాలన్న ఉద్దేశ్యం ఎవరికి లేదన్నారు.. అధికారులు చంద్రబాబు దగ్గర భజన చేస్తూ తిరుగుతూ భక్తులను గాలికి వదిలేశారని విమర్శించారు.. గత ఏడాది వైసీపీ హయాంలో ఎలా చేశామో అందరూ చూశారన్నారు.
కనీస సదుపాయాలు కరువు: రోజా
“భక్తులకు కనీస సదుపాయాలు లేవు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. తెలంగాణలో చూసాం.. ఓ ఘటనలో మహిళ చనిపోతే అల్లు అర్జున్ పై కేసు పెట్టారు.. ఈ ఘటనలో చంద్రబాబు నుంచి క్రింది స్థాయి అధికారులు బాధ్యత వహించాలి.. ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలా కేసులు నమోదు చేశారు.. విజయవాడ హైందవ శంఖారావంలో చెప్పారు.. హిందువులను కాపాడాలని చెప్పారు.. ఇప్పుడు ఆ పీఠాధిపతులు ఏమయ్యారు.. తిరుమల లడ్డుపై బీజేపీ, టీడీపీ నేతలు ఎన్ని మాట్లాడారో అందరూ చూశారు.. మీరు చేస్తే కరెక్టు.. మరొకరు చేస్తే తప్పు అన్నట్లు చేస్తున్నారు.. ప్రధాని మోడీకి ఒకటే విజ్ఞాపన చేస్తున్నా.. బాధ్యులను కఠినంగా శిక్షించాలి..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు…
“సనాతన యోధుడు ఈ ఘటనకు ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు.. చంద్రబాబుతో రాజీనామా చేయిస్తారా.. మీరు చేస్తారా..? హోం మంత్రి కేవలం ఇతరులను తిట్టడానికి తప్ప లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటానికి పనికి రావటం లేదు.. తొక్కిసలాటకు కారణమైన బాధ్యుతలపై క్రిమినల్ కేసులుపెట్టి లోపలేయాలి.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. చంద్రబాబు వైఫల్యం, అసమర్దత వల్లే ఇంతమంది చనిపోయారు.” అని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!