తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు. మరికొందరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు… అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది? అనే పూర్తి వివరాలతో నివేదికను జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు.
READ MORE: Los Angeles Wildfires: హాలీవుడ్ హిల్స్‌లో కార్చిచ్చు.. ఆస్కార్ వేదికకు పొంచి ఉన్న ముప్పు!
తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగ్గా స్పందించలేదని కలెక్టర్ రిపోర్టులో పేర్కొన్నారు. ” సమాచారం అందుకున్న ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చారు. భక్తులకు సాయం చేశారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు’’ అని నివేదికలో వెల్లడించారు.
READ MORE: TTD EO Shyamala Rao: “ఆ వ్యక్తి వల్లే ఘటన జరిగింది?” తొక్కిసలాట ఘటనపై ఈవో క్లారిటీ..
ఇదిలా ఉండగా..ఈవో శ్యామలరావు ఆస్పత్రిలోని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. 41 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తేలినట్లు చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.