Bhumana Karunakar Reddy: ఒక్క కేసు కాదు.. ఇలాంటివి మరో 100 కేసులు పెట్టిన నేను భయపడే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. తనపై కేసులు పెట్టడంపై స్పందించిన ఆయన.. నాపై వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమ.. మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటా, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటా.. తప్పుడు కేసులు పెట్టడం వల్ల భయపడిపోతాం అనేది మీ భ్రమ మాత్రమే అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు.. కేసుల వల్ల నేను ధర్మం వైపు నిలబడకుండా పోవడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగు అన్నారు భూమన.. న్యాయం మా వైపు ఉంది, నాపై ఒక్క కేసు కాదు, ఇలాంటివి మరో 100 కేసులు పెట్టిన నేను భయపడే వ్యక్తిని కాను అన్నారు.
Read Also: Ganja Smuggling: రూట్ మార్చిన స్మగ్లర్లు.. లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి సీజ్
ఇక, విద్యార్థి దశ నుంచి పోరాటాలు నుంచి వచ్చిన వాడిని.. ఏ తప్పు జరిగినా నేను నిలదీస్తూనే ఉంటాను అన్నారు భూమన.. మీ పాలనలో జరిగే అరాచకాలు ప్రశ్నించక పోతే పాపం అవుతుంది.. దేవుడ్ని అడ్డుపెట్టుకుని తప్పుడు వాగ్దానాలు చేసి మీరు అధికారంలోకి వచ్చారు.. మీ పాలనలో 10 నెలలు కాలంలో టీటీడీ అప్రదిష్ట పాలు అయ్యింది.. రాష్ట్ర ప్రజలు, హిందువులు అందరూ గమనిస్తున్నారని అని వ్యాఖ్యానించారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. కాగా, గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌లో భూమనప కేసు నమోదు చేశారు.. భూమనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్‌ల కింద భూమనపై ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై చర్యలు తీసుకోవాలని కోరారు.