Shabbir Ali : వక్ఫ్ బోర్డు, మతపరమైన సంస్థల నిర్వహణ, సామాజిక న్యాయంతో సంబంధం ఉన్న అంశాలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నుంచి తమ పిటిషన్లపై లభించిన సానుకూల తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు తమకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా, ప్రజల్లో న్యాయం పట్ల నమ్మకాన్ని పెంచిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తమ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పును ప్రశంసించారు. “జడ్జిలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కోర్టు మాకు న్యాయం అందించింది. పార్లమెంట్‌లో మైనారిటీలకు వ్యతిరేకంగా కొన్ని అన్యాయమైన చర్యలు జరిగినప్పటికీ, కోర్టు న్యాయబద్ధంగా తీర్పు ఇచ్చింది,” అని ఆయన తెలిపారు. ఈ పిటిషన్‌లో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పులో ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తినట్లు షబ్బీర్ అలీ వివరించారు: “డొనేషన్ ఇచ్చిన భూములపై అభ్యంతరం ఎందుకు?” ఈ ప్రశ్న కోర్టు దృష్టిని సమాజంలో సామాజిక న్యాయం , సమానత్వంపై కేంద్రీకరించిందని ఆయన అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వంటి మతపరమైన సంస్థల నిర్వహణపై షబ్బీర్ అలీ తన ఆందోళనను వ్యక్తం చేశారు. “వేరే మతాలకు చెందిన వ్యక్తులు టీటీడీలో ఎక్స్-అఫిషియో అధికారులుగా లేదా సభ్యులుగా ఉండటం సరైనది కాదు. ఇది సముచితం కాదని నేను భావిస్తున్నాను,” అని ఆయన స్పష్టంగా చెప్పారు. మతపరమైన సంస్థల నిర్వహణలో సంబంధిత మతస్తుల ఆధిపత్యం ఉండాలని ఆయన వాదించారు.
ముస్లిం మతంలో త్రిబుల్ తలాక్ అంశంపై మాట్లాడుతూ, షబ్బీర్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “త్రిబుల్ తలాక్ ముస్లిం మతంలో మాత్రమే ఉందని అనుకోవడం సరికాదు. హిందూ మతంలో కూడా ఇలాంటి విడాకుల విధానాలు గతంలో ఉండేవి,” అని ఆయన వివరించారు. ఈ విషయంలో మతాల మధ్య సమానత్వాన్ని గుర్తు చేస్తూ, ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని ఆయన సూచించారు.
Group 1 : గ్రూప్-1 హైకోర్టు తాత్కాలిక బ్రేక్.. నియామక పత్రాలు ఇవ్వొద్దు..!