సోమవారం సాయంత్రం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయగా.. తాజాగా టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ రాజీనామా చేశారు. కాగా.. చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదన్న విషయం తెలిసిందే. అయితే.. పేపర్ లీకేజీ, తదితర వ్యవహారాలపై పూర్తి బాధ్యులను గుర్తించే వరకూ రాజీనామాలను ఆమోదించకపోవచ్చని ఊహాగానాలూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తన రాజీనామాకు సంబంధించి సత్యనారాయణ ఓ లేఖ రాశారు.
Exam Postponed: తెలంగాణ జెన్ కో రాత పరీక్ష వాయిదా
లేఖలో.. తాను ఏ తప్పూ చేయలేదని, అయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము బాధ్యతలు నిర్వర్తించే వాతావరణం లేదని తెలిపారు. ఉద్యోగార్థుల ఆకాంక్షలను గౌరవిస్తూ కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాను ఎప్పుడూ విద్యార్థులు, నిరుద్యోగుల పక్షమే అని స్పష్టంచేశారు. యువత ఆశలు, ఆకాంక్షలు వీలైనంత త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నట్లు సత్యనారాయణ పేర్కొన్నారు.
V.H: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చర్..
టీఎస్పీఎస్సీలో పేపర్ల లీకేజీలు లాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎంత మానసిక ఆందోళనకు గురయ్యారో, ఎంత ఆవేదన చెందారో ఒక జర్నలిస్ట్ గా, ఒక మానవతావాదిగా తాను అర్ధం చేసుకోగలనని లేఖలో ప్రస్తావించారు. ఈ పేపర్ లీకేజీ సంఘటనలు జరిగినప్పుడు కమిషన్ బాధ్యులుగా తాము కూడా తీవ్ర మానసిక క్షోభను అనుభవించామని తెలిపారు. తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగార్తుల ప్రయోజనాలను రక్షించేందుకే అహర్నిశలు కృషిచేశామన్నారు. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కమిషన్ సభ్యుడిగా తాను తన బాధ్యతను నిర్వర్తించలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే తాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో ప్రస్తావించారు.