ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామక పరీక్షా ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను సర్వీస్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
Group 1 Prelims Exam: రాష్ట్రంలోని 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 9న (ఆదివారం) ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది.
TSPSC Group 1: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని TSPSC తేల్చి చెప్పింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టీఎస్‌పీఎస్సీ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది.
పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను వెబ్ సైట్‌లో సర్వీస్ కమిషన్ పెట్టింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తరవాత వెబ్ సైట్‌లో సర్వీస్ కమిషన్ పెట్టనుంది.
PSC Group-1: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఈ నెల 14 వరకు అవకాశం ఇచ్చిన టీఎస్ పీఎస్సీ....
Group-1 Exam: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అప్లికేషన్లకు గడువు ఈ నెల 14నే ముగిసినా.. TSPSC రెండు రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే.
గ్రూప్-1 దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పొడిగించింది. మరో రెండురోజుల పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు గురువారం చివరి రోజు కాగా.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. చివరిరోజు టీఎస్పీఎస్సీ సర్వర్ పనిచేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో.. టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 563 పోస్టుల భర్తీ ఈ ప్రకటన జారీ కాగా.. మార్చి 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది.