Big Breaking: టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సి.ఎం. కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవీ గుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, టీ.ఎస్.పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శి అనితారామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీ.కె.శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
Read Also: Sakhi: క్లాసిక్ టైటిల్ తో మూవీ.. డిసెంబర్ 15న థియేటర్స్ లోకి
Also Read
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలకు సుప్రీం కోర్ట్ జారీ చేసిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తగు మార్గ దర్శకాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Read Also: PM Modi: సానుకూల అంశాలు ఉన్నాయి కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై ప్రధాని హెచ్చరిక..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!