రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 సర్వీసుల ప్రాథమిక పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 1,019 పరీక్షా కేంద్రాలలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు 150 నిమిషాల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
ఈ నెల 16 న గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకొని వారు వెంటనే చేసుకోవాలని, తప్పులు ఉంటే గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకొని రావాలని సూచించారు.. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారన్నారు. పదింపావు తరవాత ఎవరిని సెంటర్లలోకి అనుమతించమని చెప్పారు. ఈ సారి బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందని, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్…
TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 16న నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 503 గ్రూప్ 1 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మున్సిపల్ శాఖలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టీఎస్‌పీఎస్సీ... మొత్తంగా 175 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది...
Job Notification: తెలంగాణలో నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త అందించింది. 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 న విడుదల అవుతుందని వెల్లడించింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 22 నుంచి దరఖాస్తులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించనున్నారు. నియామక పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో ఉండే అవకాశం ఉంది. మొత్తం 1540 పోస్టులలో ఏఈఈ సివిల్…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.. దీనిపై ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంకేతాలు ఇచ్చారు.. టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన… దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సమావేశాలు కూడా జరిగినట్టు ఆమె వెల్లడించారు.. మొత్తంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు..…
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సిద్ధమవుతోంది… గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదలపై వివిధ శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం నిర్వహించింది.. గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కింద 663 ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. దాదాపు 50 డిపార్ట్‌మెంట్లలో గ్రూప్-III సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కింద 1373 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో..…
Telangana Public Sevice Commission: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో/సంస్థల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్)కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ ప్రక్రియను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) అమలుచేస్తున్న సంగతి తెలిసిందే.