TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 16న నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 503 గ్రూప్ 1 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షకు మొత్తం అర్హులైన 3,80,202మంది అప్లై చేసుకున్నారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని టీఎస్ పీఎస్సీ సూచించింది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 16న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు.
Read Also: Devotional organic farming: ‘మాపల్లె’ వెబ్ సైట్ ఆవిష్కరించిన ప్రకాశ్ రాజ్!
ఉమ్మడి రాష్ట్రంలోనూ గత ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తంలో (503ఖాళీలు) గ్రూప్ 1 పోస్టులను నింపిన సందర్భాలు చాలా అరుదు. ఈ నియామకాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకూడదన్న ఆలోచనతో ప్రభుత్వం ఇంటర్వ్యూలను సైతం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాత పరీక్షలను సైతం అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచింది.
Read Also:Tallest Tree: ఫలించిన మూడేళ్ల నిరీక్షణ.. అమెజాన్‌లో ఆ చెట్టును చేరుకున్న శాస్త్రవేత్తలు
ప్రతీ జిల్లాలో పరీక్ష కోసం ఎగ్జామ్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ప్రతీ జిల్లాలో 30 నుంచి 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సీసీ కెమెరాల నీడలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించాలని టీఎస్సీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రతీ 24 మంది అభ్యర్థులకు ఓ సీసీ కెమెరాను ఏర్పాటు చేయనున్నారు. అన్ని కేంద్రాల్లోని సీసీ కెమెరాలను టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయనున్నారు అధికారులు. ఇంకా హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సైతం అనుసంధానం చేయనున్నారు.
Read Also:Andrea Jeremiah: బాత్ టబ్ వద్ద పిశాచి.. కిల్లర్ లుక్ లో కూడా కవ్విస్తుందే