Telangana State Public Sevice Commission: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో/సంస్థల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్)కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ ప్రక్రియను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాది పొడవునా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్లు వచ్చిన ప్రతిసారీ ఉద్యోగార్థులు తమ వివరాలను ఎంటర్ చేయాల్సిన పనిలేకుండా ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి డిటెయిల్స్‌ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక ప్రతిసారీ వాటితోనే అర్హత కలిగిన అన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. తద్వారా అభ్యర్థులకు సమయం, డబ్బు ఆదా అవుతుంది. దరఖాస్తు విధానం సులువవుతుంది. ఈ మేరకు యూపీఎస్సీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని అప్‌డేట్ చేసింది. దీంతో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరవ్వాలనుకునేవారు ఈ ఓటీఆర్ ప్లాట్‌ఫామ్‌లో తమ ప్రాథమిక వివరాలను సరిగ్గా నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఇలా జాగ్రత్తగా నమోదుచేసిన డిటెయిల్స్ యూపీఎస్సీ సర్వర్లలో భద్రంగా నిక్షిప్తమై ఉంటాయి.
America Student Visa: అమెరికా స్టూడెంట్ వీసా రిజెక్ట్ అయిందా?. మళ్లీ ఛాన్స్.
జాబ్స్ నోటిఫికేషన్ వచ్చాక వాటికి ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు దాదాపు 70 శాతం కామన్ వివరాలు ఆటోమేటిగ్గా ట్యాగ్ అవుతాయి. మిగతా 30 శాతం అప్‌డేటెడ్ డిటెయిల్స్ ఏమైనా ఉంటే అప్పుడు కొత్తగా ఎంటర్ చేయొచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగార్థులు పొరపాటున తప్పు సమాచారం ఇచ్చే ప్రమాదం తలెత్తదు. ఈ ఓటీఆర్ ప్రక్రియ www.upsc.gov.in, upsconline.nic.in అనే రెండు వెబ్‌సైట్లలో 24/7 అందుబాటులో ఉంటుంది. అందులో ఉన్న ఓటీఆర్ రూల్స్‌కి అనుగుణంగా కేర్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
వ్యక్తిగత, విద్యార్హత తదితర వివరాలకు సంబంధించి ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాకుండా సరైన సమాచారాన్ని నింపాలి. ఈ మేరకు యూపీఎస్సీ.. ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్ క్వచ్చన్స్(ఎఫ్‌ఏక్యూల)ని రూపొందించింది. టీఎస్‌పీఎస్సీ బాటలో యూపీఎస్సీ కూడా ఓటీఆర్ ప్రక్రియను ప్రవేశపెట్టడం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే మరిన్ని సంస్కరణలు చేపట్టాలని కోరుతున్నారు.