మరో నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్పీ)... ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందట విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కి అప్పుడే న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందంటూ ఇద్దరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా దానిపై ఇవాళ విచారణ జరగనుంది. మహిళా రిజర్వేషన్లను అమలుచేయటం వల్ల అనేక మంది పురుష అభ్యర్థులు నష్టపోనున్నారని రోహిత్ బాల, కృష్ణ అనే ఇద్దరు ఉద్యోగార్థులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తమకు మెరిట్ ఉన్నప్పటికీ ఉద్యోగాలు పొందలేని…
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. వీటికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో గురుకులాల్లోనే మొత్తం 9,096 పోస్టులున్నాయి. మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445 పోస్టులు, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా మరో 995 పోస్టులు భర్తీ చేసేందుకు…
గ్రూప్ -1 పోస్టుల నోటిఫికేషన్ దరఖాస్తు గడువు నేటితో యుగియనుంది. వాస్తవానికి మే నెలాఖరుతో తుది గడువు ముగియగా.. అభ్యర్థులకు మరో అవకాశం కల్పించిన టీఎస్‌పీఎస్సీ జూన్ 4 వరకు అవకాశం కల్పించింది. మొత్తం 503 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాగా, మే 31 నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆన్‌లైన్ పేమెంట్, సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా.. అభ్యర్థుల కోరిక మేరకు టీఎస్‌పీఎస్సీ గడువును నాలుగు రోజులు…
తెలంగాణలో నోటిఫికేషన్ల జాతర మొదలైంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగా.. త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ త్వరగా ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎప్రిల్ లో గ్రూప్ 1లో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ రోజు మే 31తో గ్రూప్ 1 అప్లికేషన్…
తెలంగాణ నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పబోతోంది ప్రభుత్వం. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు అన్ని శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రూప్ 4 కేడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని… దీనికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సోమేష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే టీఎస్పీఎస్పీ గ్రూప్…