ఈ నెల 16 న గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకొని వారు వెంటనే చేసుకోవాలని, తప్పులు ఉంటే గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకొని రావాలని సూచించారు.. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారన్నారు. పదింపావు తరవాత ఎవరిని సెంటర్లలోకి అనుమతించమని చెప్పారు. ఈ సారి బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందని, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలని సూచించారు. షూ ధరించి రావొద్దని, ఎక్కువగా ఆభరణాలు ధరించి రావొద్దని అభ్యర్ధులను కోరారు. ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదని స్పష్టం చేశారు జనార్ధన్ రెడ్డి. ఇక, రెండు నెలల్లో ప్రిలిమ్స్ ఫలితాలు, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్ష ఉంటుందని వివరించారు. ఎగ్జామ్ పేపర్ కోడ్ న్యూమరికల్ లో ఉంటుందన్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి..
Rerad Also: KC Venugopal: రేవంత్ ఈ విషయంలో ఎందుకు వెనుకపడ్డావు..?
కాగా, ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూపరీక్ష జరగనుంది.. 503 పోస్టుల కోసం 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. పరీక్ష నిర్వహణ కోసం 1,019 సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచే హాల్లోకి అనుమతించనున్నారు.. అభ్యర్థులు హాల్‌టికెట్లతో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ (ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్) తో సెంటర్ కు రావాల్సి ఉంటుంది.. ఇక, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.. సెంటర్ పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి..