యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం దేవలమ్మ నాగారంలో R&B శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మునుగోడు ఎన్నికలు కేవలం కాంట్రాక్టు కోసం వచ్చాయి తప్ప అభివృద్ధి కోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం మునుగోడు ఉపఎన్నిక. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
త్వరలోనే నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం విస్తృతంగా పర్యటనలు సాగిస్తూనే ఉన్నారు.. అయితే, ఇప్పుడు ఉప ఎన్నికలో అధికార పార్టీ.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పేరుతో బరిలోకి దిగుతుందా? లేక టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే పోటీ చేస్తుందా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.. ఎందుకంటే.. నిన్నటి నిన్ననే టీఆర్ఎస్‌ను…
దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. విజయదశమి రోజున ముహూర్తం పెట్టి మరీ పార్టీ పేరును మార్చారు.. తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది.. టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఇవాళ బీఆర్‌ఎస్ నేతలు.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. ఈ మేరకు సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పుపై ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అందజేయనున్నారు.. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌పై చర్చ…
HD Kumaraswamy comments on cm kcr and BRS: దళితుల పట్ల రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న కమిట్మెంట్ గొప్పది.. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణలో విజయం సాధించారని అన్నారు జేడీయూ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమార స్వామి. తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతగా పోరాటం చేశారో మాకు తెలుసని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా వున్నారని ఆయన అన్నారు. అదే పద్దతిలో దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్…