ప్రధాని మోడీ, అమిత్ షా... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన రూ. 18 వేల కోట్లు.. మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల అభివృద్ధికి ఇవ్వండి... అలా చేస్తే తాము ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని ప్రకటించారు మంత్రి జగదీష్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు అనే బండి సంజయ్ వ్యాక్యలకు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోటార్లు కావాలా? మీటర్లు కావాలా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవానలి మంత్రి హరీశ్ రావ్ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ఎన్నిక ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష అని అన్నారు. కోట్లు పెట్టి ప్రజలను కొనాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.