మరోసారి రాష్ట్రంలోని బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కేంద్ర నాయకత్వం తెలంగాణ ప్రభుత్వ పథకాలను అభినందిస్తుంటే.. గల్లీలో ఉన్న బీజేపీ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.. మమ్మల్ని పొగుడుతున్న కేంద్ర నాయకత్వాన్ని ఇక్కడి బీజేపీ నాయకులు తిట్టాలి అంటూ సలహా ఇచ్చారు. మిషన్ భగీరథకు కేంద్ర అవార్డుపైనా బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి.. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి షెకావత్.. మిషన్ భగీరథను…
జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇవాళ తెరాస నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండాపై స్పష్టతనిచ్చే అవకాశముంది. దసరా నాడు ప్రకటించనుండడంతో ఏం చేయాలనే దానిపై దృష్టి సారించారు గులాబీ బాస్.
Etela Rajender Comments On CM KCR: తెలంగాణలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోందని అన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మునుగోడు గడ్డపై ఎగిరేది కాషాయజెండానే అని అన్నారు. ప్రజాసంబంధ పథకాలను కేసీఆర్ ఎప్పుడూ తీసుకురాలేదని.. పవర్ ఓరియెంటెడ్ పాలసీలనే తీసుకువస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ‘దళిత బంధు’ గుర్తుకు వచ్చిందని.. మునుగోడులో గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ‘గిరిజన బంధు’ ఇస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఐఏఎస్, ఐపీఎస్…
తెలంగాణ మంత్రి హరీష్‌రావు… తాజాగా ఏపీ సర్కార్, అక్కడి టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్లు చేశారు.. అయితే, హరీష్‌రావు కామెంట్లపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్ర ఆదాయాలు తక్కువగా ఉన్నా అద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు.. మా రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత హరీష్ రావుకు, కేసీఆర్‌కు లేదన్న…
జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యారు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… ఈ దసరా రోజే కొత్త పార్టీ జెండా, అజెండా ప్రకటించేందుకు సన్నద్ధం అయ్యారని తెలుస్తోంది.. ఇక, దేశవ్యాప్తంగా విస్తృత్తంగా పర్యటించేందుకు ఏకంగా ప్రత్యేక విమానాన్ని కూడా కొనుగోలు చేయనుందట టీఆర్ఎస్ పార్టీ.. ఇదే సమయంలో.. థర్డ్ ఫ్రంట్‌పై కూడా చర్చ సాగుతోంది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… థర్డ్ ఫ్రంట్, కేసీఆర్ జాతీయ పార్టీపై…