తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత రాష్ట్ర సమతి (బీఆర్‌ఎస్) మార్చుతున్నట్లు ప్రకటించారు. అయితే.. గత కొన్ని నెలల నుంచి జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ ప్రవేశిస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందకు థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చినా.. ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీనే బీఆర్‌ఎస్ పార్టీగా మార్చుతూ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు కసరత్తు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి పార్టీ పేరు మార్చుతున్నట్లు దానికి సంబంధించిన పనులను చేస్తున్నారు.
అయితే.. కేసీఆర్ పార్టీ పేరును ప్రకటించిన నాటి నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ పేరుతో బ్యానర్లు, హోర్డింగ్‌లు వెలుస్తున్నాయి. అయితే.. ముఖ్యంగా ఏపీలో దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కేసీఆర్ జాతీయ పార్టీ బ్యానర్లు వెలిశాయి. గడియార స్తంభం సెంటర్‌లో బీఆర్‌ఎస్ పేరుతో బ్యానర్లను ఏర్పాటు చేశారు. జై బోలో… జై కేసీఆర్ నినాదాలతో బ్యానర్లు కనిపిస్తున్నాయి. అయితే.. దీంతో.. కోనసీమలో బీఆర్‌ఎస్ బ్యానర్లు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా అమలాపురం పార్లమెంటు బీఆర్‌ఎస్ అభ్యర్థి రేవు అమ్మాజీరావు పేరుతో బ్యానర్లు దర్శనమివ్వడం గమనార్హం.