టీఆర్ఎస్ బీజేపీ రాజకీయ వైరుధ్యం ఉన్నది అని చెప్పే డ్రామా నడుస్తుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది ఏండ్లలో టీఆర్‌ఎస్ అవినీతిపై మోడీ విచారణకు ఆదేశించినట్టు బీజేపీ చెప్పుకుంటుందని, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తారు అని నమ్మించే భ్రమలు కల్పిస్తున్నారని ఆయన అన్నారు. ఈడీ, సీబీఐ వేట కుక్కల లెక్క పడుతుంది అని డ్రామా రావు చెప్పుకున్నాడని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ బీజేపీ మధ్య యుద్ధం జరుగుతుంది అని చెప్పుకునే కుట్ర జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ.. అమిత్ షా… అందరూ కేసీఆర్ అవినీతిపై మట్లాడుతున్నారు. ఢిల్లీ హైకోర్టులో 2017 లో నేను పిల్ వేశా.
టీఆర్ఎస్ ప్లీనరీ నిధుల సేకరణకు గులాబీ కూలి అని చేశారు. పది రోజులు వ్యాపార సంస్థలను బెదిరించి వసూలు చేశారు. ఏసీబీకి నేను ఫిర్యాదు చేశా.. కనీసం పట్టించుకోలేదు అని కోర్టుకి వెళ్లిన.. ఏసీబీ కోర్టుకు… చందా కోసం తీసుకున్న డబ్బులు అని చెప్పింది.. . కానీ 20 వేల కంటే ఎక్కువ నగదు గుర్తింపు పొందిన పార్టీ తీసుకోకూడదు. పార్టీ ఆదాయ.. ఖర్చులు ఈసీ కి ఇవ్వాలి. కూలిలో వసూలు చేసిన డబ్బుల వివరాలు రికార్డ్ లో ఈసీకి ఎక్కడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.