HD Kumaraswamy comments on cm kcr and BRS: దళితుల పట్ల రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న కమిట్మెంట్ గొప్పది.. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణలో విజయం సాధించారని అన్నారు జేడీయూ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమార స్వామి. తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతగా పోరాటం చేశారో మాకు తెలుసని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా వున్నారని ఆయన అన్నారు. అదే పద్దతిలో దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
తెలంగాణను అభివృద్ధి చేయాలనే మీ కలలను సాకారం చేసుకున్నారని.. మీరు దేశాభివృద్దిని సవాలుగా తీసుకున్నారని కేసీఆర్ గురించి అన్నారు. కేసీఆర్ ప్రసంగంలో పేదలు బడుగు బలహీన వర్గాల పట్ల నిబద్దతను తెలియజేసిందన్నారు. దళితులు, రైతుల అభివృద్దిని తెలంగాణలో పెద్ద ఎత్తున మీరు సాధించారని.. ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం దేశ నిర్మాణం కోసమే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా విస్తరించాలని కోరుకున్నారని కుమారస్వామి అన్నారు.
Read Also: Winston Benjamin: విరాట్ గొప్ప కెప్టెన్ కాదు.. విండీస్ మాజీ క్రికెటర్ బాంబ్
దేశాభివృద్ధి కోసం కేసీఆర్ కంటున్న పారదర్శక కల సాకారం కావాలని కోరుకుంటున్నానని.. కేసీఆర్ దేశ నిర్మాణానికి అవసరమైన విజనరీ లీడర్, ఛాలెంజింగ్ లీడర్, లిజెండరీ లీడరని పొగిడారు. తెలంగాణలో విజయవంతమైన మీ పనితీరును మీరు గమనిస్తున్నామని..మీరు విజయం సాధించారని కుమారస్వామి అన్నారు. అందుకే మేము ఇక్కడి వచ్చామని.. కేంద్రంలో గత ఏడేండ్ల కాలంలో అధికార దుర్వినియోగం జరుగుతున్నదని ఆయన అన్నారు. దానికి గట్టి సమాధానం చెప్పేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారని.. అయితే అది రాజకీయ ప్రతీకార భావనతో కాకుండా అభివృద్ధి ద్వారా, దేశ ప్రజల విశ్వాసాన్ని పొందడానికి సిఎం కేసీఆర్ చేస్తున్న కృషికి మా మద్దతుంటుందని తెలిపారు. కేసీఆర్ భవిష్యత్ రాజకీయ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని కుమారస్వామి అన్నారు.