Vemula Prashanth Reddy: యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం దేవలమ్మ నాగారంలో R&B శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మునుగోడు ఎన్నికలు కేవలం కాంట్రాక్టు కోసం వచ్చాయి తప్ప అభివృద్ధి కోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి ప్రతి ఒక్క టీఆర్‌ఎస్ కార్యకర్త కసిగా ఉన్నారని అన్నారు. ఒక్క రోజు కూడా గ్రామాల్లో తిరగలేదు.. గెలిచాక ఇతర దేశాల్లో విలాసంగా తిరగడం ప్రజలు గమనించారని ఆరోపించారు. దేశంలోనే తెలంగాణా రోల్ మోడల్ గా మారిందని అన్నారు.
Read also: Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్ పై జగదీశ్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు..
ఇది గమనించిన బీజేపీ.. తెలంగాణా లో బీజేపీ ఆటలు సాగవని మునుగోడు ఉప ఎన్నికలను తెరపైకి తెచ్చారు. ఒక్క పని కూడా చేయని బీజేపీ ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ప్రతి సామాన్యుని బ్యాంకు ఖాతాలో 15 లక్షలు ఇస్తానన్న మోడీ ఇవ్వకపోగా.. తన దోస్తులకు మాత్రం12 లక్షల కోట్లు మాఫీ చేసి భారీగా కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. రాజా గోపాల్ రెడ్డి కి డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవ చేశారు. కేసీఆర్ దేశ నాయకుడు కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు తొందరలోనే మంచి రోజులు వస్తాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
CM YS Jagan: ఆక్వా రైతుల ఫిర్యాదులపై సీఎం సీరియస్.. ముగ్గురు మంత్రులతో కమిటీ