తెలంగాణలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. అన్న విషయంలో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న బద్వేల్ నియోజకవర్గంతో కలిపి.. దీపావళి తర్వాతే ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న స్పష్టతను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఇచ్చేసింది. ఏపీలో చూస్తే.. పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే ఉంది. హుజురాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ చతుర్ముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది.…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పూజోత్సవం. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్న, ఎంతటి స్థాయి కి ఎదిగిన గురువు గుర్తుకు వస్తారు. ఉపాధ్యాయ ఎంఎల్ సి అని గురువులు చట్టసభల్లో ఉండాలని పెట్టుకున్నాం. విద్య ఉద్యోగం కోసం కాదు, ఉన్నతమైన గౌరవం కోసం అని తెలిపారు.…
ఒక్క భేటీ వంద అనుమానాలకు కారణమైంది. పార్టీ కార్యాలయ శంకుస్ధాపనకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్…ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని కలిశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్… అలాంటిదేం లేదు… కాళ్ల బేరానికి వచ్చారని బిజెపి విమర్శిస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీ టూర్ చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది. మూడు రోజుల డిల్లీ పర్యటనకు బుధవారం బయలుదేరి వెళ్లారు సియం కేసిఆర్. సెప్టెంబర్ 2 న వసంత్ విహర్ లో పార్టీ…
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతలంతా వీరలెవల్లో ఫార్మామెన్స్ చేసేస్తున్నారు. ఎవరికీ వారు తగ్గెదేలే అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో నేతల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలు సైతం బహిర్గతం అవుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ లో చేరిన నేత కౌశిక్ రెడ్డి.. బీజేపీ నేత ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం…
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా అన్ని పార్టీలు భావించాయి. నేడో రేపో ఉప ఎన్నికలు ఉంటాయని అందరూ ఉత్కంఠగా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈసీ బాంబు పేల్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల బైపోల్ ఇప్పట్లో లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పడంతో అంతా ఊసురుమంటున్నారు. మరోవైపు ఉప ఎన్నిక వాయిదా ఏ పార్టీకి కలిసి వస్తుంది? ఇంకేవరికీ మైనస్ అవుతుందనే చర్చ తెలంగాణలో జోరుగా సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను…
కరోనా తీవ్రత ఇంకా తగ్గనేలేదు. ప్రతి రోజు ప్రతి రాష్ట్రంలో వందల సంఖ్యలో ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయినా.. రాజకీయ కార్యకలాపాల జోరు మాత్రం తగ్గడం లేదు. ప్రత్యామ్నాయాలు ఉన్నా.. వాటిని పాటించడంలో పార్టీల నాయకత్వాలు, నేతలు ఏ మాత్రం పట్టింపు లేకుండా పోతుండడం.. జనానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. లక్షలాదిగా జన సమీకరణ చేస్తుండడం కరోనా వ్యాప్తికి కారణం అవుతుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ సభలు.. పాదయాత్రలు, సమావేశాలను కాస్త నివారించినా.. అది అందరికీ మేలు…
ఢిల్లీ : కేంద్ర హోమంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. కేంద్ర హో మంత్రి అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరిగింది. విభజన చట్టం హామీల అమలు, ఐపీఎస్ అధికారుల సంఖ్య ని 195 కు పెంచాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేయనున్నారు సీఎం కేసీఆర్. ఐపీఎస్ కేడర్ పోస్టుల కేటాయింపులు…
సీఎం కేసీఆర్ పై ఈటెల జమున ఫైర్ అయ్యారు. ఇవాళ వీణ వంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈటల జమున ఇంటింటి ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఈటెల జమున మాట్లాడుతూ… ఉద్యమాల గడ్డ హుజురాబాద్ అని.. శ్రీకాంత్ చారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారి ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదని… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముగ్గురు ఆంధ్ర ముఖ్యమంత్రులను ఎదురించి ఈటెల కొట్లాడాడని తెలిపారు.…
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆయనను యాదాద్రికి ఆహ్వానించారు కేసీఆర్.. ఇతర అంశాలను కూడా పీఎం దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే మోడీని కలిశారనే కామెంట్లు కూడా వినబడ్డాయి.. అయితే, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్… సీఎం కేసీఆర్ భయపడి ప్రధాని మోడీని కలవలేదని.. భయపడే నైజం కేసీఆర్ ది కాదన్న ఆయన..…
నిరంతరం ప్రజల కోసం పని చేసే సీఎం కేసీఆర్‌కు.. ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గెలుపును కానుకగా ఇద్దాం… మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగాపూర్ దేశాయిపల్లిలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు గ్రామస్తులు.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా పని చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను…