ఢిల్లీ : కేంద్ర హోమంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. కేంద్ర హో మంత్రి అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరిగింది. విభజన చట్టం హామీల అమలు, ఐపీఎస్ అధికారుల సంఖ్య ని 195 కు పెంచాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేయనున్నారు సీఎం కేసీఆర్. ఐపీఎస్ కేడర్ పోస్టుల కేటాయింపులు జరిపితే ఐపీఎస్ అధికారులను కమిషనర్లు, ఎస్పీలు, జోనల్ డీఐజీ, మల్టీజోనల్ ఐజీపీలుగా నియమించడానికి వీలవుతుందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు కేసీఆర్. కాగా.. నిన్న ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే.