ఒకే దెబ్బకు చాలా పిట్టలు.. కేసీఆర్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా 50వేల ఉద్యోగాల ప్రకటన.. జాబ్ క్యాలెండర్ ను దసరాకు రిలీజ్ చేసి అటు వైఎస్ షర్మిలకు ఎజెండా లేకుండా చేయడం.. ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోరు మూయించడమే ధ్యేయంగా ముందుకెళుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ నిరుద్యోగుల ఆశలు నెరవేరడంతోపాటు వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ లను దెబ్బతీయవచ్చని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రత్యర్థి…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఈ నెల 1వ తేదీన ఢిల్లీ వెళ్లిన ఆయన.. మరుసటి రోజు టీఆర్‌ఎస్ కార్యాలయానికి శంకుస్థాపనలో పాల్గొన్నారు.. ఇక, మరుసటి రోజు.. ప్రధాని మోడీని, ఆ తర్వాత అమిత్‌షాను.. ఇవాళ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర షెకావత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. రేపు కూడా హస్తినలోనే ఉండనున్నారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే ఆరు…
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కొల్హాపూర్, సోమశిల, కరువేన గుండా ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యా వరకు (ఎన్.హెచ్ 167 కే. జాతీయ రహదారి నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఈ జాతీయ రహదారి వల్ల తెలంగాణలోని కల్వకుర్తి, కొల్హాపూర్, సోమశిల, ఆంధ్ర ప్రదేశ్ లోని ఆత్మకూరు లాంటి వెనుక…
మంత్రి హరీష్‌రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్… జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని నమ్ముకొని ఈటల రాజేందర్ మోసపోయారని గమనించాలని సూచించారు.. ఇక, రబ్బరు చెప్పులు కూడా లేని హరీష్ రావుకు వందల కోట్ల ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో దొంగ నోట్లు పంచిన కేసు ఉండే అని కామెంట్ చేసిన…
తెలంగాణ జానపదానికి ఉన్న ఫాలోయింగే వేరు.. ఎప్పటికప్పుడు ఒక్కోపాట తెగ ట్రెండ్ అవుతుంది.. ఎక్కడికి వెళ్లినా అదే పాట ఇనిపిస్తుంటింది.. ఇప్పుడు తెలంగాణతో పాటు ఏపీలోనూ ట్రెండింగ్‌లో ఉన్న పాట బుల్లెట్ బండి… ఆ మధ్య ఓ వధువు.. పెళ్లి బరాత్‌లో ఈ పాటకు స్టెప్పులు వేయడంతో తెగ వైరల్ అయిపోయింది.. ఇక, ఆ తర్వాత ప్రతీ పెళ్లిలో బుల్లెట్ బండి పాట ఉండాల్సిందే అనే తరహాలో.. చాలా పెళ్లిళ్లలో ఈ పాటకు కాలు కదుపుతున్నారు. ఇప్పటికే…
ఈటల రాజేందర్ చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్స్ లో టీఆర్ఎస్‌లో పలువురు ఇతర పార్టీలకు చెందినవారు చేరారు.. వారికి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన హరీష్‌రావు.. దళిత…
హుజూరాబాద్ బై పోల్…..తెలంగాణలో హైవోల్టేజీ ఎలక్షన్. ఈ నెలలోనే అనుకున్నారంతా. షెడ్యూల్ రేపో మాపో అన్నారు. ఇంకేముంది ..అధికార పార్టీతో సహా అన్ని రాజకీయపక్షాల్లో చెప్పలేనంత హడావుడి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. భారీ ర్యాలీలు, సభలు.. పంచ్ డైలాగులు. దాంతో పొలిటికల్ హీట్ పీక్ కి చేరింది. కానీ అంతలోనే పెద్ద షాక్. ఎన్నికలు ఇప్పట్లో లేవంటూ ఈసీ అనౌన్స్‌మెంట్. దాంతో నేతల ఉరిమే ఉత్సాహం కాస్తా చల్లబడింది. ఈటల రాజేందర్ వ్యవహారం మొదలై దాదాపు ఐదు నెలలవుతోంది.…
సమాజ నిర్మాతలు మీరే-జాతి నిర్మాణం లో భాగస్వాములు కావాలని… భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. విద్యార్థులకు నైతిక విలువలు,మానవీయ విలువలు నేర్పించాలని… ప్రయివేటు పాఠశాలల్లో లాగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్కూల్ డే లు నిర్వహిస్తామన్నారు. చిన్ననాడు పీర్ల కోటం లో చదువుకున్న, నాడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు తనకెప్పటికి ఆదర్శమని వివరించారు. ఎంత ఎదిగిన గురువు ను మర్చిపోవొద్దని…గురుపూజ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు…
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సొంత పార్టీకి చెందిన మహిళా నేతే ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది… తననూ, తన కుమారులను చంపుతానని ఎమ్మెల్యే ఫోన్‌లో బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ మహిళా నేత పద్మా రెడ్డి… ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మంచిర్యాల ఏసీపీకి ఫిర్యాదు చేశారు.. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి బూతులు తిట్టాడని ఆరోపించిన ఆమె.. నా ఇద్దరు కుమారులను, నన్ను చంపేస్తానని ఎమ్మెల్యే చిన్నయ్య వార్నింగ్ ఇచ్చాడనీ..…