హుజురాబాద్ గెలుపు కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం.. అభివృద్ధి బాధ్యత నాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరంతరం ప్రజల కోసం పని చేసే సీఎం కేసీఆర్‌కు.. ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గెలుపును కానుకగా ఇద్దాం… మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగాపూర్ దేశాయిపల్లిలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు గ్రామస్తులు.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా పని చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను బలపరుద్దాం.. కులవృత్తులను బలో పేతంచేసేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.. ఒకప్పుడు తెలంగాణ అంటే ఆత్మహత్యలు, ఆకలి కేకలు, వలసలు ఉండేవి.. ఇప్పుడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అన్నారు.. దేశంలో అత్యధికంగా వరి పంట పండించే పంజాబ్ ను వెనక్కు నెట్టి, తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందన్నారు.
ఇక, యాసంగిలో 3 కోట్ల మెట్రిక్‌టన్నులవరి పంట పండించి తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచిందన్నారు మంత్రి హరీష్‌రావు.. ఇది సీఎం కేసీఆర్ దూరదృష్టి, ప్రణాళిక వల్లే సాధ్యమైందన్న ఆయన.. ఇది అవుతుందా అన్న కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డ్ సమయంలో పూర్తి చేసి రైతన్నకు సాగు నీటికొరత లేకుండా చేశారన్నారు.. కాళేశ్వరం తొలి ఫలితం అందుకున్న నియోజకవర్గం హుజురాబాద్ అని గుర్తుచేసిన ఆయన.. నేడు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు ఎందుకు వచ్చాయో మీకు తెలుసు అని.. తన స్వార్థంకోసం ఈటల రాజేందర్ రాజీనామా వల్ల ఈ ఎన్నికలు వచ్చాయన్నారు.. మంత్రిగా పేదల కోసం ఒక్క ఇళ్లు కట్టని ఈటల గెలిస్తే, ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఇళ్లు నిర్మించి ఇస్తారా? అని ప్రశ్నించిన ఆయన.. వ్యక్తి ప్రయోజనమా… హుజురాబాద్ ప్రజల ప్రయోజనాలా.. మీరే ఆలోచించండి అని సూచించారు. గెల్లు శ్రీనివాస్ ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా అన్నారు మంత్రి హరీష్‌రావు.
Also Read
- WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
- Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
- Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
- Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!