హూజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే. ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా ఆయన వేవ్ కొనసాగుతోంది. అయితే ఈటలను ఎలాగైనా హుజూరాబాద్లో ఓడించాలని సీఎం కేసీఆర్ పకడ్బంధీగా పావులు కదుపుతున్నారు. దీంతో ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా పోటీ మారిపోయింది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లురుతోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎదుర్కొనే మొదటి…
రాజకీయాల్లో ఎమర్జ్ అయ్యే నేతలు కొందరు.. ప్రజలపై స్పష్టమైన ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటారు. భవిష్యత్ పై క్లియర్ అజెండాతో ముందుకు వెళ్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో.. 3 ప్రధాన పార్టీల్లో.. ముగ్గురు యువనేతలు ఇలాగే రాజకీయాలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. రాబోయే తరానికి కాబోయే రాజకీయ సారథులం మేమే అన్నట్టుగా వారు తమ తమ పార్టీల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందులో టీఆర్ఎస్ ను గమనిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగా.. మంత్రిగా గుర్తింపు తెచ్చుకుని.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇతరులు ఇలా చాలా మంది కరోనా బారీన పడ్డారు. అయితే.. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే..…
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బండి సంజయ్ వాడిన సర్జికల్ స్ట్రైక్స్ అన్న పదం.. ఎంతటి ప్రభావాన్ని కలిగించిందో మనం ప్రత్యక్షంగా చూశాం. బీజేపీ అనూహ్య ఫలితాలను సొంతం చేసుకుని.. జీహెచ్ఎంసీలో బలం పుంజుకున్న తీరును సైతం గమనించాం. ఇదే ఒరవడిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముందుకు తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇందుకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్ లో మాదిరిగా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. వెంటనే…
ప్రజా సంగ్రామ యాత్ర కి కేంద్ర నాయకత్వం మద్దతు పూర్తిగా ఉంది అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి పొర్లు దండాలు పెట్టడం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్ హామీలు గుర్తు చేస్తున్నారు అని చెప్పిన బండి సంజయ్ తెలంగాణ వచ్చిన తర్వాత విమోచన దినోత్సవం ను ఎందుకు జరపడం లేదు అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17 నిర్వహించే సభకి కేంద్ర హోంమంత్రి…
బీజేపీ గట్టిగా ఊదితే కొట్టకపోయే పార్టీ తెరాసా మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇంత దాదా గిరి చేస్తున్న నీకే ఇంత ఉంటే మాకు ఎంత ఉండాలి. మాకు సహనం ఉంది మౌనంగా చూస్తున్నాం. ఎన్ని తప్పులు చేస్తున్నావో లెక్క వేసి పెట్టుకుంటున్నాము. సందర్భం వచ్చినప్పుడు నీ భరతం పడతాం. కేసీఆర్ కాదు కదా ఆయన జేజెమ్మ దిగివచ్చినా హుజురాబాద్ లో గెలవలేరు అని తెలిపారు. ఛాలెంజ్ చేస్తున్న తాగుడు ఆపి, కొనుగోళ్లు ఆపి ప్రజాస్వామ్య…
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలను చీల్చి చెండాడాడు. టీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలపై కొద్దికాలంగా మౌనంగా ఉంటున్న మంత్రి కేటీఆర్ ఈరోజు బరస్ట్ అయ్యాడు. టీఆర్ఎస్ ప్లీనరీ సాక్షిగా తన మౌనాన్ని బద్దలు కొట్టారు. తాజాగా జలవిహార్లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి ప్లీనరీ సమావేశంలో ప్రత్యర్థులపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాన్న.. పందులే గుంపులుగా వస్తాయని.. సింహం సింగిల్ గా వస్తుంద’నే రీతిలో ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేశాడు. టీఆర్ఎస్…
ఆ మాజీ మంత్రి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారా? విపక్షాలు వేగం పెంచడంతో టంగ్ స్లిప్ అవుతున్నారా? వివాదాస్పద కామెంట్స్ ప్రచారం కోసమా లేక ఫస్ట్రేషన్‌తో చేస్తున్నారా? ఎవరా మాజీ మంత్రి? హామీ ఇస్తే విపక్షాలకు 6 నెలలు అధికారం అప్పగిస్తారట! జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మాజీ మంత్రి కూడా. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. ఆయనకు ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నారు? అనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలను నిలిపివేసి..…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ శిబిరాన్ని మాత్రం టెన్షన్ పెడుతోందా? హజురాబాద్ ఉపఎన్నికపై పడే ప్రతికూల ప్రభావంపై లెక్కలు వేస్తున్నారా? బీజేపీలో చేరేముందే ఏ అంశంపై అయితే ఈటల స్పష్టత కోరారో.. ఇప్పుడు అదే మళ్లీ చర్చకు వస్తోందా? సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ చూపించే ప్రభావంపై ఈటల వర్గం ఆరా? అదిగో.. ఇదిగో తేదీ ప్రకటించేస్తారని అనుకుంటున్న వేళ హుజురాబాద్ ఉపఎన్నికపై కేంద్ర…
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనే టార్గెట్‌గా విమర్శలు సంధించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్‌తో బీజేపీ ఎప్పటికీ కలవదని స్పష్టం చేశారు. దళిత బంధులాగే.. బీసీ, గిరిజన బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి కేసీఆర్ ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్. 10వ రోజు పాదయాత్ర కొనసాగించిన ఆయన.. ఢిల్లీలో తెలంగాణ భవన్ దేని కోసం? ఎవరి కోసం కడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ…