తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రధాని మోడీతో ఢిల్లీలో సమావేశం అయ్యారు. సుమారు 50నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఇక ప్రధాని మోడికి 10 అంశాలతో కూడిన వినతులను అందజేశారు. తెలంగాణలో ఐసీఎస్‌ల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను 139 నుంచి 195 కి పెంచాలని కోరారు. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రీయల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ…
సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ ఓ పట్టాన అర్థం కావన్నది పొలిటికల్ సర్కిల్స్ లో తరచూ వినిపించే మాట… ప్రత్యర్థులు వాటిని అర్థం చేసుకునే లోపే ఆయన తన పని చక్కబెట్టుకోగల నేర్పరి. ఎంతో ముందుచూపుతో ఆయన వ్యూహాలు ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నా తనకు ఏమాత్రం ఫరక్ రాకుండా చూసుకోవడం కేసీఆర్ దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన రచించిన వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి. తెలంగాణ ప్రజలందరీలో ఉద్యమ…
సిద్దిపేట : ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ పోలి లక్ష్మణ్ ముదిరాజ్ మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత నిచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని.. మత్స్య కారులకు దేశంలో ఏ ప్రభుత్వం లేనంత అండగా టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్య కారుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు…
ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యం లోనే సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన ను మరో రెండు రోజుల పొడిగించుకున్నారు. గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ పై ప్రధాని మోడీ మరియు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల పై ప్రధాని…
ఎన్నికలంటేనే బోల్డంత ఖర్చు. పోలింగ్ తేదీ ఖరారైతే ఖర్చుకు ఒక లెక్క తెలుస్తుంది. హుజురాబాద్‌లో మాత్రం అంతా రివర్స్. ఉపఎన్నిక ఎప్పుడో తెలియదు. 2 నెలలుగా ప్రధాన పార్టీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప ఎలక్షన్ ఎప్పుడో.. ఏంటో.. క్లారిటీ లేదు? ఇంకా ఎన్ని రోజులు.. ఎంత ఖర్చు పెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారట నేతలు. వందల మందితో కలిసి ఎన్నికల ప్రచారం! హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.…
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం లో జెండా పండుగ కార్యక్రమం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మెజారితో గెలవడం ఖాయం. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఈటల మాటలకు స్పందించారు ప్రభుత్వం బాల్క సుమన్. ఈటల రాజేందర్ శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకోవడానికి మానసికంగా ఇప్పటి నుండే సిద్ధం కావాలి. దమ్ముంటే కేసీఆర్, హరీష్ రావు నామీద పోటీ చేయాలనే స్థాయి…
రేవంత్ రెడ్డి పీసీసీ, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే. గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదు… పెంచిన గ్యాస్ , డీజిల్ ధరల పై ఢిల్లీ యాత్రలు చేయాలి. టీఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృధి లో ఇతర రాష్ట్రాలకు…
కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాయని అంటుంటారు. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు గమనిస్తే అది నిజమే అని ఎవరైనా అంగీకరిస్తారు. తాజాగా.. ఢిల్లీలో తెలంగాణ భవన్ కు శంకుస్థాపన చేస్తున్న కేసీఆర్ తీరు.. సైతం ఈ చర్చలో ముందుకు వస్తోంది. ఇదంతా.. భవిష్యత్ రాజకీయాలకు పునాదిగా భావించవచ్చా.. అన్న ప్రశ్నలు సైతం ఉదయిస్తున్నాయి. ఇందుకు రకరకాల కారణాలను రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి రోజు రోజుకూ బలం పెరుగుతున్నాకొద్దీ..…
మూడురోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్.. ఢిల్లీ చేరుకున్నారు. రేపు హస్తినలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయనున్నారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. రేపు మధ్యాహ్నం 1.48గంటలకు ఢిల్లీ వసంత్ విహార్‌లో.. టీఆర్‌ఎస్‌కు కేంద్రం కేటాయించిన స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు.. నిర్మాణ స్థలంలో భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఢిల్లీలోని వసంత్ విహారం మెట్రో స్టేషన్ పక్కన.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం…
ఢిల్లీ : కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అటవీ పర్యావరణ, కార్మిక శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్ లను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కలిశారు. రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ కు స్కిల్ డెవలప్ మెంట్ కింద కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞప్తి చేశారు మంత్రి మల్లారెడ్డి. నాచారంలో ఉన్న 350 బెడ్ల ఈఎస్ఐ హాస్పటల్ నిర్మాణం త్వరగా…