కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ కు డబుల్ దమాకా అని… గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యే, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇక హుజురాబాద్ కు డోక లేదని మంత్రి హరీష్ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపికి మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఇవాళ హుజురాబాద్ నియోజక వర్గంలో పర్యటించిన ఈ సందర్భంగా మాట్లాడుతూ… రైతు బంధుకు, రైతు ద్రోహులకు మధ్య పోటీ అని తాను అంటున్నానని తెలిపారు. మార్కెట్ యార్డులు రద్దు,…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. హిందువుల కోసం తాను చెప్పిన 4 అంశాల పై చర్చకు సిద్ధమా…? అని ప్రశ్నించారు. హిందువుల కోసం మోడీతో మాట్లాడి పెట్రోల్, డీజీల్ గ్యాస్ ధరలు తగ్గించగలవా ? తెలంగాణ లో ఉన్న పేద హిందువులకు రూ. 15 లక్షలు మోడీ తో ఇప్పించగలవా ? అని సవాల్ విసిరారు జగ్గారెడ్డి. తెలంగాణ లో ఉన్న 80 శాతం హిందువులకోసం మాట మీద నిలపడుతావా…
సెప్టెంబర్ రెండో తేదిన టీఆర్‌ఎస్ పార్టీ జెండా పండుగ జరుగనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులతో ఇవాళ మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని..ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అదే రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్నీచోట్ల, అన్నీ గ్రామాలు, పట్టణాల్లో జెండా…
రాజకీయాల్లో ఉన్నప్పుడు మాటలు పొదుపుగా వాడాలి. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ స్టేట్‌మెంట్ ఆ మాజీ మంత్రి రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసిందని టాక్. దీంతో పార్టీలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందట. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథా? టీఆర్‌ఎస్‌లో ఉనికి కోసం పోరాటం? కడియం శ్రీహరి. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం. టీఆర్‌ఎస్ నాయకుడు. ప్రస్తుతం చేతిలో ఎలాంటి పదవి లేదు. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని…
టీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే కెసిఆర్ నా? హరీష్ నా ? ఎవరు నిలబడతారో చెప్పాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ”మీ పోలీసులని, అధికారులను, మంత్రులను, డబ్బులు ఆపు, కొనుగోళ్లు ఆపి ప్రచారం చెయ్యి నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? ఆ దమ్ముందా?” అంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శక్తి పైసలతో రాదని.. ప్రజా బలంతో వస్తుందన్నారు. తాను…
బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సీటును గుంజుకుంటాం.. ఏనుగెక్కి ప్రగతి భవన్ కు వస్తామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఆయన కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టిఆర్ఎస్ నాయకుల బెదిరింపులకు భయపడమని… ఎన్నికల కోసమే దళితబంధు అని నిప్పులు చెరిగారు. నిజాంషుగర్ ను ప్రైవేటీకరణ చేసి వేలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. ఇక్కడి రైతులకు కావాల్సిన పసుపు బోర్డు తేవడంలో…
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే ఎంఐఎం దొంగలను పాకిస్తాన్ కు పంపిస్తామని హెచ్చరించారు రాజా సింగ్. మోడీ దెబ్బకు జనగణమన పాడుతున్నారని తెలిపారు. ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీ కి ఎంఐఎం పార్టీ వత్తాసు పలికుతుందని ఫైర్ అయ్యారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనేనని… ఏమి చేస్తారో ఇప్పుడే ఆలోచించుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఛార్మినార్ దగ్గర…
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి హబ్’ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, మార్గదర్శకత్వంలో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయం పట్ల ప్రేమ, సాగునీటి రంగంపై ఉన్న శ్రద్ధతో ఈ ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయ, సాగునీటి రంగంలో ఏ రాష్ట్రం సాధించని అద్వితీమయమైన విజయాలను సాధించిందన్నారు. ప్రపంచం అబ్బురపడే విధంగా…
మరోసారి హస్తినబాట పట్టనున్నారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ఈ సారి మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగనుంది.. కేసీఆర్ పర్యటనకు ఈసారి చాలా ప్రత్యేకత ఉంది.. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించి.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని ఎప్పటి నుంచో భావిస్తున్న గులాబీ పార్టీ అధినేత.. హస్తినలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు.. ఇక, ఈ మూడు రోజుల పర్యటనలో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు.…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ… ఉప ఎన్నికలు ఎక్కడ జరిగిన టీఆరెఎస్ అబద్ధపు జీవోలు విడుదల చేస్తున్నారు. ఆ జీవోలు ఎక్కడ అమలు కావు ఆన్లైన్ లో ఉండవు. దేశం లో అవినీతి లో మొదటి స్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలిచిన తరువాత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుండి బయటికి వస్తున్నాడు. ఈటల రాజేందర్ రాజీనామా తో సీఎంఓ అఫీస్ లో…