ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.. ఇప్పటి వరకు అన్నీ ఓపికగా భరించాం.. ఇక, నోటికిఏదివస్తే అది మాట్లాడితే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అయితే, దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలి అంటూ సవాల్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా.. తాడ్వాయిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడతారా?…
ప్రధానమంత్రి మోడీ భేటీ బచావో, భేటీ పడవో పిలుపు ఇచ్చారు. కానీ దేశంలో బాలికలకు రక్షణ లేకుండా పోయింది అని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అన్నారు. సింగరేణి కాలనీలో ఒక 6 ఏళ్ల గిరిజన అమ్మాయిని అత్యాచారం చేసి చంపారు. మొన్నటిమొన్న మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ చేశారు. వీరిద్దరి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చారు.. ఆ కుటుంబాలను ఆడుకోవడం ప్రభుత్వ బాధ్యత. కానీ హజీపూర్ లో జరిగిన మూడు బలహీన వర్గాలు…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఐక్యపోరాటాలు చేయాలని తెలంగాణ ప్రతిపక్షాలు నిర్ణయించాయి. గాంధీభవన్లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఫోర్ పాయింట్ ఫార్ములాను ప్రకటించారు. పోడుభూములతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉమ్మడిగా కార్యక్రమాలు చేపడతామన్నారు నేతలు. తెలంగాణలో భూసమస్యలు, ధరణి వెబ్ సైట్ లోపాలపై సీరియస్ గా పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపాయి. గాంధీభవన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల…
ఆ అధికారపార్టీ ఎంపీ ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరుస్తున్నారా? సొంత సామాజికవర్గమే కావడంతో పక్క నియోజకవర్గ ఎంపీతో స్నేహబంధాన్ని బలోపేతం చేస్తున్నారా? ఇదంతా సేఫ్ గేమ్‌లో భాగమా లేక.. భవిష్యత్ రాజకీయ వ్యూహమా? సొంత పార్టీలోనూ అనుమానాలకు బీజం పడిందా? ఎవరా అధికార పార్టీ ఎంపీ? ఏంటా స్నేహగీతం..! ఎంపీ పాటిల్ కొత్త స్నేహాలపై చర్చ! బీబీ పాటిల్. జహీరాబాద్ ఎంపీ. టీఆర్‌ఎస్ నుంచి వరసగా రెండోసారి గెలిచారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా.. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎన్నికల్లో…
త్వరలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరుగనుంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఎన్నిక మారింది. దీంతో ఎవరికీవారు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లురుతున్నారు. ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా టీఆర్ఎస్ నుంచి యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నాడు. కాంగ్రెస్ పోటీలో నిలిచినా అది రెండో, మూడో ప్లేస్ కోసమనే అర్థమవుతోంది. దీంతో పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యేనని స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్తేమీకాదు.…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పీకింది ఏమీ లేదని… కేంద్రంలో కూడా పీకింది ఏమీ లేదన్నారు. ప్రధాని వద్దకు పోయి నిధుల సంగతి తేలుద్దామా? తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ తప్పయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దేశంలో 78 కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్ కేంద్రం…
గజ్వేల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ విజయవంతం అయినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. ఆ సభకు 2 లక్షల మంది వరకు వచ్చినట్టు లెక్కలు వేస్తున్నారు.. అయితే, దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ నేత, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. 8 ఎకరాల్లో 2 లక్షల మంది ఎలా పడతారు?…
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నాం అని తెలిపారు. హుజూరాబాద్ నుండి సైదాపూర్ రోడ్డు కు అరు కోట్ల తో పనులు ప్రారంభం ఉన్నాయి. ఆరు సార్లు గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎందుకు అభివృద్ది చేయలేదు. కరీంనగర్ లో వేసిన రోడ్ల లాగా హుజూరాబాద్ రోడ్లను అధునికరిస్తం అని…
గత మూడు నెలలుగా హుజూరాబాద్‌లో ప్రచార హోరు లేని రోజు. ప్రధాన పార్టీల సందడే సండది. అయితే ఉన్నట్టుండి నియోజకవర్గం సైలెంట్ అయ్యింది. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సడన్‌గా నియోజకవర్గాన్ని వీడారు. అక్కడి వీధులు..సందులు ..గొందుల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఇక్కడ ప్రచారం చేస్తోన్న బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నియోజకవర్గం దాటి వెళ్లటమే ఈ సైలెన్స్‌కు కారణం. అప్పటి వరకు అక్కడి రోడ్ల మీద హల్ చల్ చేసిన…
అధికారపార్టీలో ఎమ్మెల్యేల జోడు పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? వరసగా ఇద్దరికి కీలక పదవులు కట్టబెట్టడంతో.. ఇతరులకు లైన్ క్లియరైనట్టేనా? ఆశలు వదిలేసుకున్నవారు మళ్లీ హుషారుగా ఎదురు చూస్తున్నారా? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎమ్మెల్యేలలో పదవులపై ఆశలు టీఆర్ఎస్‌లో కొంత కాలంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జరుగుతోంది. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటికే పదవుల పొందిన వారిలో కొందరికి రెన్యువల్ అయితే.. కొత్త వాళ్లలో మరికొందరికి అవకాశం దక్కింది. ఎమ్మెల్యేలకు నామినేటెడ్…