కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నాం అని తెలిపారు. హుజూరాబాద్ నుండి సైదాపూర్ రోడ్డు కు అరు కోట్ల తో పనులు ప్రారంభం ఉన్నాయి. ఆరు సార్లు గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎందుకు అభివృద్ది చేయలేదు. కరీంనగర్ లో వేసిన రోడ్ల లాగా హుజూరాబాద్ రోడ్లను అధునికరిస్తం అని తెలిపారు.
Read Also : మూగబోయిన హుజూరాబాద్…
ఇక హుజూరాబాద్ లో ఎన్నికల కోసం అభివృద్ది చేయడం లేదు అని చెప్పిన ఆయన తెలంగాణ అంత అభివృద్ది జరిగితే హుజూరాబాద్ అభివృద్ది కాక కుగ్రాం గా మిగిలి పోయింది. హుజూరాబాద్ మున్సిపల్ మూడు నెలల్లో అభివృద్ది అంటే ఎంటిదో చుపెడుతున్నం. దేశం లో ఎక్కడ లేని విధంగా హుజూరాబాద్ నుండి సైదాపూర్ రోడ్డు అధ్వాన్నం గా నిర్మించారు. హుజూరాబాద్ నియోజక వర్గం అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎప్పుడు నిధులు అడుగలేదు. హుజూరాబాద్ పట్టణం లో త్వరలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు భూమి పూజ చేస్తాం. మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజక వర్గాన్ని అన్ని రకాలుగా నిర్లక్ష్యం చేసిండు అన్న ఆయన హుజూరాబాద్ ను సిద్దిపేట,సిరిసిల్ల,గజ్వేల్.కరీంనగర్ లాగా అభివృద్ది చేస్తాం అని పేర్కొన్నారు.