బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పీకింది ఏమీ లేదని… కేంద్రంలో కూడా పీకింది ఏమీ లేదన్నారు. ప్రధాని వద్దకు పోయి నిధుల సంగతి తేలుద్దామా? తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ తప్పయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దేశంలో 78 కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్ కేంద్రం ఇచ్చిందని… బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యమ కారులకు పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవం నాడు కేసీఆర్ జెండా ఎగరవేయలేదని… తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.