ప్రధానమంత్రి మోడీ భేటీ బచావో, భేటీ పడవో పిలుపు ఇచ్చారు. కానీ దేశంలో బాలికలకు రక్షణ లేకుండా పోయింది అని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అన్నారు. సింగరేణి కాలనీలో ఒక 6 ఏళ్ల గిరిజన అమ్మాయిని అత్యాచారం చేసి చంపారు. మొన్నటిమొన్న మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ చేశారు. వీరిద్దరి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చారు.. ఆ కుటుంబాలను ఆడుకోవడం ప్రభుత్వ బాధ్యత. కానీ హజీపూర్ లో జరిగిన మూడు బలహీన వర్గాలు అమ్మాయిల అత్యాచారం, హత్యల విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదు అని తెలిపారు. కోర్టు చెప్తే హజీపూర్ బాధితులకు నిర్భయ ఫండ్ నుంచి పరిహారం ఇచ్చారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. హజీపూర్ లో శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బీసీ అమ్మాయిలను రేప్ చేసి హత్య చేస్తే ప్రభుత్వం పట్టించుకోదా.. ఈ మూడు కుటుంబాలు కూడా పేద కుటుంబాలు.. వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాలి. సవతితల్లి ప్రేమ చూపిస్తుంది… ఈ విషయంలోను, అంబేద్కర్ విగ్రహం ఏర్పటు విషయంలో కాంగ్రెస్ పోరాటం చేస్తుంది అని పేర్కొన్నారు.