తెలంగాణ ఆర్టీసీ బలోపేతంపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఈ మధ్యే టీఎస్‌ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్‌ను నియమించారు.. ఆయన క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆర్టీసీ పరిస్థితిపై అధ్యయనం మొదలు పెట్టారు.. ఇక, ఇవాళ ఆర్టీసీ చైర్మన్‌గా సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్.. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సీనియప్ రాజకీయనేతగానే…
పార్టీ కమిటీల ఎంపికకు ముందే అధికారపార్టీ ఎమ్మెల్యేల మధ్య లొల్లి మొదలైందా? జిల్లాస్థాయి పదవులను తమ నియోజకవర్గానికే కేటాయించేలా ఎత్తుగడలు వేస్తున్నారా? ఈ విషయంలో ఎవరికి వారు చక్రం తిప్పుతున్నారా? ఇంతకీ ఏంటా పదవి? ఏమా గొడవ? అనుచరులకు పదవులు కట్టబెట్టే యత్నం? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు ముక్కలైన తర్వాత.. ఏర్పాటవుతున్న టీఆర్‌ఎస్ కమిటీలకు నలుగురు జిల్లా అధ్యక్షులు రాబోతున్నారు. ఈ విషయంలో జిల్లాల్లో కీలకంగా ఉన్న నాయకులు తెరవెనక పెద్ద మంత్రాంగమే నడుపుతున్నారట. మంత్రి…
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చేసింది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఆయన రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దళిత, గిరిజన దండోరా పేరుతో పలు జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇదే ఊపులో ఆయన టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రలు లోపించాయని.. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్…
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసరడం హాట్ టాపిక్ అయ్యింది.. ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో సవాల్ చేసిన ఆయన నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధమా? అని ప్రశ్నించారు.. అయితే, దీనికి అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.. యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం 9 శాతం నిధులు అధికంగా రాష్ట్రానికి ఇచ్చిందన్న ఆయన.. సీఎం కేసీఆర్ వస్తే…
తెలంగాణ రాష్ట్రంలో లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చుకున్నామని… త్వరలో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మహిళ సంఘాలకు రెండు కోట్ల 13లక్షల 48వేల వడ్డి లేని రుణాలు ఇవ్వడం సంతోషంగా ఉందని.. బతుకమ్మ…
సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భ్రుతిపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భ్రుతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష…
టీఆర్ఎస్ పార్టీలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. హూజూరాబాద్ ఉప ఎన్నికను ఈటల రాజేందర్ తోపాటు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ పొలిటికల్ హీట్ మొదలైంది. కాంగ్రెస్ సైతం హుజురాబాద్ వేదికగా తమ సత్తా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ ఎన్నిక ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.…
కోవిడ్ విషయంలో ప్రపంచంలోనే భారత్ ఎక్కడ లేని విధంగా 77 కోట్ల డోసుల టీకాలు ఇచ్చింది. థర్డ్ వేవ్ మ్యుటేషన్ అయి వస్తే కూడా ప్రాణనష్టం జరగకుండా వ్యాక్సునేషన్ ను ఉద్యమంలా మార్చారు ప్రధాని మోడీ అని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావ్ పీసీ అన్నారు. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ కు అన్ని విషయాల్లో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే అని తెలిపారు. తెలంగాణ విమోచనం విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. ఓటు బ్యాంకు…
చాలాకాలం తర్వాత టీఆర్ఎస్‌లో పార్టీ పదవుల నియామకం జరగబోతుంది. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో నేతల మధ్య రేస్ కూడా మొదలైంది. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేస్తున్నారట. అధినేత ఫ్రేమ్‌లో పట్టేది ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ ఏంటా పదవులు. ఎందుకంత డిమాండ్? లెట్స్ వాచ్! టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవుల కోసం రేస్..! సెప్టెంబర్ 2న జెండా పండుగతో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మొదలు పెట్టింది టీఆర్ఎస్. ఈ నెల 20లోపు గ్రామ, మండల…
ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య అస్సలు పడటం లేదు. ఆ ప్రభావం పార్టీ కమిటీలపైనా పడింది. మరోసారి ఆధిపత్య పోరుకు దారితీసింది. ఒక నియోజకవర్గం.. రెండు కమిటీలుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడో ఏంటో.. లెట్స్ వాచ్! తాండూరులో ఎవరి కమిటీ వారిదే..! వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు మరోసారి వార్తల్లో నిలిచారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానం నేతలందర్ని ఆదేశించింది. ఇప్పుడు…