బాలీవుడ్ ఎంట్రీపై హీరో మహేష్ బాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. హిందీలో ఆఫర్లు ఉన్నప్పటికీ బాలీవుడ్ నిర్మాతలు తనను భరించలేరన్న ఆయన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సినీ రంగం నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తాజాగా నటి కంగనా రనౌత్ మహేశ్ బాబుకు మద్దతుగా మాట్లాడారు. మహేశ్ బాబు అన్నది నిజమే…ఆయనను బాలీవుడ్ భరించలేదని చెప్పింది. ఆయనకి తగిన రెమ్యునరేషన్‌ని బాలీవుడ్ ఇవ్వలేదని కూడా చెప్పింది. అంతేకాకుండా టాలీవుడ్‌ను చూసి చాలా…
యూసుఫ్ గూడ బస్తీలో యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని సినీనటి కరాటే కల్యాణి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి దాడిచేసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. ఆయన వీడియోలకు మంచి ఆదరణ ఉంది. నిన్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కల్యాణి.. ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని…
బాలీవుడ్ తనని భరించలేదని, అక్కడికెళ్ళి తన సమయాన్ని వృధా చేసుకోలేనని మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. బాలీవుడ్ నుంచి తారాస్థాయి వ్యతిరేకత ఎదురవుతోంది. మహేశ్‌ని చాలా బ్యాడ్‌గా ట్రోల్ చేస్తున్నారు. తాను బాలీవుడ్‌ని కించపరచలేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ.. మహేశ్‌పై విమర్శలు ఆగడం లేదు. అయితే.. నిర్మాత బోనీ కపూర్ మాత్రం తాను మహేశ్ వ్యాఖ్యలపై స్పందించనని చేతులెత్తేశాడు. ఆ కామెంట్స్‌పై రియాక్ట్ అవ్వడానికి తాను…
సినిమా పరిశ్రమలో మరో హీరోయిన్ తల్లి కాబోతోంది. ఆమె ఎవరో కాదు… నమిత. ఈరోజు నమిత పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్ ఫోటోను పోస్ట్ చేసింది. ‘మాతృత్వం… నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేను మారాను, నాలోనూ మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా.…
తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్లో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్ల విజ్ఞప్తులకు వెంటనే స్పందించడమే కాదు.. అప్పుడప్పుడు తానే ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట ప్రజలతో ముచ్చటిస్తారు. వారి సమస్యల్ని తెలుసుకొని, అప్పటికప్పుడే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తారు. ఈరోజు కూడా ఆయన ట్విటర్లో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ ఓ ప్రశ్న సంధించారు. తెలుగు వినోద రంగానికి ప్రపంచస్థాయి ఫిలిం స్కూల్/యూనివర్సిటీ అవసరం ఉందని, తద్వారా హైదరాబాద్‌ను భారతీయ చిత్ర రంగానికి…
కథల ఎంపిక విషయంలో హీరోలందరూ దాదాపు తన సొంత నిర్ణయాలే తీసుకుంటారు. చుట్టుపక్కల వారి సలహాలు ఏమాత్రం తీసుకోరు. ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంటుంది కాబట్టి, నలుగుర్నీ అడిగితే నాలుగు విధానాల సమాధానాలు వస్తాయి. అప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయాలా? వద్దా? అనే విషయంపై మరింత కన్ఫ్యూజన్ నెలకొంటుంది. అందుకే, సొంత నిర్ణయం మీదే కథానాయకులు ఆధారపడతారు. తానూ ఆ కోవకి చెందినవాడినేనని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. ‘‘ఫలక్‌నుమా దాస్, పాగల్ సినిమాల్లో ఒక డిఫరెంట్ యాటిట్యూడ్…
కమెడియన్, సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన రాహుల్ రామకృష్ణ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విటర్ మాధ్యమంగా వెల్లడించాడు. తన కాబోయే భార్యకు లిప్‌లాక్ ఇచ్చిన ఫోటోను షేర్ చేస్తూ.. పెళ్ళి విషయాన్ని రాహుల్ ప్రకటించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిజానికి.. రాహుల్ ప్యాండెమిక్కి ముందే తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, అప్పుడు కుదరకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పరిస్థితులు…
(మే 8న మదర్స్ డే సందర్భంగా…) తెలుగు చిత్రసీమలో తల్లి పాత్రల్లో అలరించిన వారెందరో ఉన్నారు. వారిలోనూ చిత్రవిచిత్రంగా సాగిన వైనమూ కనిపిస్తుంది. తమ కంటే వయసులో ఎంతో పెద్దవారయిన నటులకు అమ్మలుగా నటించి ఆకట్టుకున్నవారూ ఉన్నారు. ఒకప్పుడు కొందరు హీరోల సరసన నాయికలుగా నటించి, తరువాతి రోజుల్లో వారికే తల్లులుగా నటించి మెప్పించిన సందర్భాలూ ఉన్నాయి. ఇక తల్లిగా నటించిన వారితో తరువాత నాయకులుగా నటించిన వారూ లేకపోలేదు. ఇలా చిత్ర విచిత్రమైన సినిమా రంగంలో…