ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే భయపడే హీరోయిన్స్.. ఇప్పుడు అదొక ప్రెస్టిజియస్ ఇష్యూలా తీసుకుంటున్నారు. స్పెషల్ సాంగ్స్ వస్తే అస్సలు నో చెప్పడం లేదు. శ్రియా సరన్ నుంచి మొదలు తమన్నా భాటియా, శృతి హాసన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ పెప్ సాంగ్స్‌లో స్టెప్స్ వేసి ఆడియన్స్‌కు కిక్ ఇచ్చారు. పూజా హెగ్డే, శ్రీలీల, కేతిక శర్మ లాంటి భామలకు ఐటమ్ సాంగ్స్ కెరీర్ టర్నింగ్ పాయింట్స్‌గా నిలిచాయి. దీంతో ఐటమ్ సాంగ్స్ వస్తే నో…
తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో తొలిసారిగా సినిమాలపై జరుగుతున్న డిజిటల్ మానిప్యులేషన్, ఆన్లైన్ దుష్ప్రచారాన్ని అడ్డుకునే దిశగా కీలక అడుగు పడింది. కోర్టు ఆదేశాల మేరకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు సంబంధించి టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో రేటింగ్స్, రివ్యూలను చట్టబద్ధంగా నియంత్రించేలా చర్యలు చేపట్టారు. దాంతో నిజమైన ప్రేక్షకుల తీర్పుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, కావాలని చేసే దుష్ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ లేని వినూత్న నిర్ణయంగా సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.…
అభిషేక్ బచ్చన్ : హిరోగా మార్కెట్ డల్‌గా ఉండటంతో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ యాంటోగనిస్టుగా ఛేంజ్ అయ్యాడు. షారూక్ ఖాన్ కింగ్ సినిమాలో విలన్ అవతారమెత్తాడు. హీరోగా అభిషేక్‌కు ఫామ్ లేకపోయినప్పటికీ.. అవకాశాలకు వచ్చిన ఢోకాలేదు. ఇప్పటికీ మెయిన్ లీడ్‌గా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. కానీ అనవసరంగా ప్రొడ్యూసర్స్‌ను ఇబ్బంది పెట్టడకూడదనుకున్నాడో లేక ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తానన్నారో కింగ్‌లో షారూఖ్‌తో తలపడబోతున్నాడు. అయితే అభిషేక్‌కు విలన్ రోల్ పోషించడం ఇప్పుడేమీ కొత్తకాదు. గతంలో కొన్ని సినిమాల్లో…
టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి పరిచయం అక్కర్లేదు. ‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ సినిమాలతో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే అనన్య తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బొంబాయి నుంచి వచ్చిన హీరోయిన్లకు దక్కినంత త్వరగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని ఆమె కుండబద్దలు కొట్టింది. Also Read : The Rajasaab:…
డిఫరెంట్ కాన్సెప్టులతో, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు యూత్‌ను ఆకట్టుకుంటోన్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు. సైడ్ క్యారెక్టర్ల నుండి హీరోగా మారిన ఈ టాలెంట్ యాక్టర్‌కు సింగిల్‌తో కింగ్ ఆఫ్ కంటెంట్, ఎంటర్ టైనర్ అంటూ ట్యాగ్స్ వచ్చాయి. ఈ ట్యాగ్స్ కు జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా.. అందుకే నెక్ట్స్ సినిమాల్లో ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్నాడు. జస్ట్ జోవియల్ కథలే కాదు.. సీరియస్ స్టోరీలు టచ్ చేయబోతున్నాడు. Also Read…
2025 తన కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచిందని హీరో నాగ చైతన్య అన్నారు. ‘తండేల్’ సినిమా తన సినీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పారు. తన కెరీర్లో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తన తొలి చిత్రంగా తండేల్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. కొత్త ఏడాదిలో తన లైఫ్‌లో ఎన్నో ఉత్తేజకరమైన పరిణామాలు జరగనున్నాయన్నారు. నటుడిగా కొత్త కథలను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కథల ఎంపిక విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటానని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ‘2025…
రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఈ వారమే ప్రభాస్ నటించిన హార్రర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’ థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే మారుతి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలు పెంచేయగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇక లేటెస్ట్గా ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌తో రిలీజ్ అయిన నాచే నాచే సాంగ్ థియేటర్లు తగలబడిపోతాయ్.. అనే హైప్ క్రియేట్ చేసింది. ప్రోమోతోనే సోషల్…
యాంకర్ నుండి హీరోయిన్గా మేకోవరైన కోలీవుడ్ నటి ‘ప్రియ భవానీ శంకర్’. సొంత ఇంట్లో ఫ్రూవ్ చేసుకోగలింది కానీ.. టాలీవుడ్లో మాత్రం ఆమెను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘కళ్యాణం కమనీయం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా.. ఇక్కడ చేసినవన్నీ ఫ్లాప్సే. 2024లో వచ్చిన భీమా కూడా హిట్ ఇవ్వలేకపోయింది. అయినా కూడా ప్రియ టాలీవుడ్ మరో అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరో ‘రవితేజ’ సరసన నటిస్తున్నట్లు సమాచారం. Also…
టాలీవుడ్ నెక్ట్స్ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుంచి అన్ లిమిటెడ్‌కు చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ఫాక్డ్. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలో దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్‌తో పోటీపడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే.. మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా?. ఆ లిస్ట్ చాంతాడంత ఉంది. కొత్త ఏడాదిలో ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్.…