టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కాంట్రవర్సీ అంతకంతకు ముదురుతోంది. విశ్వక్ సేన్- టీవీ యాంకర్ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్ గా మారిన విషయం విదితమే. డిబేట్ నడుస్తుండగా.. లైవ్ లో విశ్వక్, యాంకర్ ను అసభ్యకరమైన పదంతో ఆమెను దూషించడం, ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం, విశ్వక్ పై అందరు దుమ్మెత్తిపోయడం జరిగాయి. ఇక ఇటీవలే తన తప్పు తెలుసుకున్నానని, ఆ పదం అన్నందుకు సారీ చెప్తున్నానని మీడియా ముందే విశ్వక్…
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ అంటే టక్కున వినపడే పేర్లు రశ్మిక, పూజా హేగ్డే. అయితే ఈ మధ్య కాలంలో పూజా వరుస పరాజయాలను ఫేస్ చేస్తూ వస్తోంది. తాజాగా ఏకంగా ప్లాఫ్ లలో హ్యాట్రిక్ సైతం కొట్టేసింది. అమ్మడి హ్యాట్రిక్ కి ‘ఆచార్య’ బ్రేక వేస్తుందని అందరూ ఆశించినా అది నెరవేరలేదు. ఈ మెగా మల్టీస్టారర్ సైతం పూజకు హ్యాండిచ్చింది. దీంతో పూజ హ్యాట్రిక్ ప్లాఫ్ లను ఎదుర్కొవలసి వచ్చింది. ఒక్కో సినిమాకు మూడు…
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5″లో సెట్టూ అంటూ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న బ్యూటీ శ్వేతా వర్మ. తాజాగా ఈ బ్యూటీకి ఓ చేదు అనుభవం ఎదురైందట. అదే విషయాన్నీ వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది శ్వేత. “చాలా బాధగా అన్పిస్తోంది. ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసేసుకున్నారు. నాకు ఇలా ఆశలు కల్పించి, వెంటనే ఆశలపై నీళ్లు చల్లడం ఏమైందా భావ్యమా? ఈ బాధను…
సీనియర్ నటి భూమిక షేర్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో ఈ బ్యూటీ చిట్టి పొట్టి బట్టలు ధరించి, గ్లామర్ లుక్ లో కన్పిస్తోంది. అయితే ఆ పిక్ ఇప్పటిది కాదట. అసలు ఆ పిక్ ఎప్పుడు తిసిందో తనకు కూడా గుర్తు లేదంటూ చెప్పుకొచ్చింది భూమిక. అయితే ఈ పిక్ ను చూసిన నెటిజన్లు ఏజ్ అనేది నెంబర్ మాత్రమే అంటూ భూమిక బ్యూటీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే…
మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ హెల్త్ కార్డ్స్ పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావును గుర్తు చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో తన గురించి ఆయన ఒక మంచి ఆర్టికల్ రాయడంతో పొంగిపోయానని, ఆ తరువాత పసుపులేటి రామారావును కలిసి ఏదైనా బహుమతి ఇద్దామనుకుంటే, ఆయన సున్నితంగా తిరస్కరించారని, ఇలాంటి వాటికోసం ఆర్టికల్ రాయలేదని,…
టాలీవుడ్లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది.. దర్శకుడు పైడి రమేష్ మృతిచెందారు.. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ ఎలెన్ నగర్లో ఓ భవనం పై నుంచి జారిపడి ఆయన కన్నుమూశారు.. భవనం నాలుగో అంతస్తులో బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ మూలంగా షాక్ కొట్టడంతో.. ఆయన ప్రమాదవశాత్తు జారిపడినట్టుగా చెబుతున్నారు. Read Also: KTR : కేంద్రమంత్రిపై ట్విట్టస్త్రాలు సంధించిన కేటీఆర్.. నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు పైడి…
మల్టీ ట్యాలెంటెడ్ మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ ఇప్పుడు యూట్యూబ్ పై కన్నేసింది. ఇప్పటిదాకా వెండితెరపై తన ట్యాలెంట్ ను చూపించిన ఈ భామ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అభిమానులకు మరింత దగ్గర కాబోతోంది. ఆ గుడ్ న్యూస్ ను తాజాగా అభిమానులతో పంచుకుంది నిత్యా. ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో స్వంత యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దానికి ఆమె ‘నిత్య అన్ఫిల్టర్డ్’ అని టైటిల్ పెట్టారు. ఛానెల్లో సినీ ప్రపంచంలో ఆమె 12 సంవత్సరాల…
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్ గత డిసెంబర్ నుండి ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారు. సుదీర్ఘ అనారోగ్యంతో ఏప్రిల్ 19న ఆయన కన్నుమూశారు. దాంతో ఏప్రిల్ 27న ఫిలిమ్ ఛాంబర్ కార్యవర్గం సమావేశమైంది. ఛాంబర్ నియమ నిబంధనలను అనుసరించి, ఉపాధ్యక్షుడైన కొల్లి రామకృష్ణ (రిథమ డిజిటల్ థియేటర్స్ అధినేత)ను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడుగా ఎన్నుకొన్నారు. కొల్లి రామకృష్ణ పదవి కాలం ఈ యేడాది జూలై 31 వరకూ…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ సినిమాలతోనే వార్తల్లో ఉండే జక్కన్న ఈసారి మాత్రం ఓ కొత్త కారణంతో అందరి దృష్టిని ఆకర్షించారు. జక్కన్న గ్యారేజ్ లోకి కాస్ట్లీ కారు వచ్చి చేరింది. దానికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ కారును రాజమౌళి స్వయంగా…