సినిమా పరిశ్రమలో ఫ్యాన్స్ ఉండాలన్న…పబ్లిక్‌లోకి వెళితే సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, పాపులారిటీ, సెలబ్రిటీ హోదా వంటివి కేవలం హీరోలు, నటులకు మాత్రమే దక్కుతాయి. ఎంత ఖర్చు పెట్టి సినిమాను తీసిన నిర్మాతకైనా, ఎన్నో రోజులు కష్టపడి సినిమాకి దర్శకత్వం వహించే డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ పేరు, గుర్తింపు హీరోకే దక్కుతాయి. అందుకేనేమో…డైరెక్టర్‌గా చేసిన చాలా మంది హీరోలుగా, నటులుగా మారిపోయారు. అయితే అందులో అందరూ సక్సెస్ కాకపోయినప్పటికి కొందరు మాత్రం ఆడియన్స్ దగ్గర పాస్ మార్కులు వేయించుకున్నారు. ఈ లిస్ట్‌లోకి చేరిపోబోతున్నారు డైరెక్టర్ అనీల్ రావిపూడి. పటాస్,సుప్రీం,రాజా ది గ్రేట్,F2,సరిలేరునీకెవ్వరూ,F3 వంటి ఆరు హిట్ సినిమాలు తీసిన తర్వాత ఆయన దృష్టి నటనపై పడింది. అయితే ఇప్పుడంటే ఇప్పుడు కాదు..దర్శకత్వంలో ఆయన బాగా తృప్తి చెంది..ఆడియన్స్ ఇక చాల్లే అని ఫీలయ్యే వరకు సినిమాలకు దర్శకత్వం వహించి…అటుపై నటనలోకి దిగుతానని ప్రకటించారు.
మనసులో మాట..
తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో అనీల్‌రావిపూడి స్వయంగా తానే ఈ విషయాన్ని వెల్లడించారు. డైరెక్షన్ కాకుండా ఇంకా వేరే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు అనీల్‌రావిపూడి నటుడిగా మారిపోతానంటూ ఆన్సర్ ఇచ్చారు. ప్రేక్షకులు తన సక్సెస్ చూసి ఇక చాలు అని ఫీలైతే చాలు డైరెక్షన్ వదిలేసి నటుడిగా మారిపోతానని మనసులో మాట ఆ కార్యక్రమం ద్వారా బయటపెట్టారు.
వాళ్లే ఇన్సిపిరేషన్..
గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి, భానుచందర్, కన్నడ హీరో ఉపేంద్ర, కమెడియన్ సునీల్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరియర్ బిగెన్ చేసి మాస్ మహారాజ్‌గా మారిన రవితేజ ఇలా చాలామంది వాళ్ల అభిరుచిని తీర్చుకొని ఇండస్ట్రీలో ఎంతో కొంత పేరు మరికొంత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ అనీల్‌రావిపూడి కూడా రైటర్, డ్యాన్సర్‌తో పాటు మంచి కామిక్ టైమింగ్ ఉన్న వాడిలా కనిపిస్తుండంతో నటన వైపు ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకోవాలంటే వారసత్వంతో పని లేదని చాలా మంది రుజువు చేశారు. నవరసాలు పండించే లక్షణాలు ఉంటే సరిపోతుందని సాధారణ నటుల నుంచి స్టార్ హీరోలైన వాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకొనే అనీల్‌రావిపూడి నటన వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. పటాస్ సినిమాతో గట్టిగా పేలి హిట్ డైరెక్టర్‌గా ముద్రపడ్డ అనీల్‌రావిపూడి…నటుడిగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో..జనం అతడ్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.