సర్కారు వారి పాటతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను యూరప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.. త్రివిక్రమ్ సినిమాతో బిజీగా మారనున్నాడు మహేష్. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్లో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో మహేష్‌ని గడ్డంతో చూపించబోతున్నాడని.. ప్రస్తుతం మహేష్ గడ్డం పెంచే పనిలో వున్నాడని చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహేష్ లుక్ కోసం…
ఎప్పుడూ వివాదాలతో వార్తల్లోకెక్కే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈసారి ఓ పోలీస్ కేసుతో తెరమీదకొచ్చారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఆయన నట్టి క్రాంతి, కరుణ అనే వ్యక్తులపై పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించిన వర్మ.. ‘మా ఇష్టం’ సినిమా సమయంలో తన సంతకాన్ని వాళ్ళు ఫోర్జరీ చేసినట్టు అందులో పేర్కొన్నారు. 2020 నవంబర్ 30వ తేదీన తన లెటర్ హెడ్ తీసుకొని, నకిలీ పత్రాల్ని సృష్టించి, ఫోర్జరీ…
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు విగ్రహా రూపాల కంటే.. వాళ్ల రూపం అచ్చం ఇలాగే ఉంటుందేమోనని అనిపించేలా.. ఇప్పటికీ, ఎప్పటికీ.. తెలుగువారికి గుర్తుకొచ్చే రూపం ఆయనదే. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన శక పురుషుని శత జయంతి సంవత్సరం ఇది. సినీనేత.. జననేత.. తిరుగులేని కథానాయకుడు.. ఎదురులేని మహానాయకుడు… విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి…
ఎన్టీయార్…. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పేరు అనటం కంటే ఈ మూడు అక్షరాలను తెలుగువారి బ్రాండ్ అనొచ్చు. ఎందుకంటే సినీ ప్రస్థానంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఆయనకు ఆయనే సాటిగా నిలవటమే కాదు.. రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి తెలుగువారి కీర్తి పతాకాలను ప్రపంచ యవనికపై రెపరెపలాడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తెలుగు వారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు నందమూరి తారక రామారావు. ఈ మే 28న ఆయన శత…
మలేసియా వెళ్లడానికి వాల్తేరు వీరయ్య రెడీ అయ్యాడు. ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసమే ఈ ప్రయాణమని విశ్వసనీయ సమాచారం. టార్గెట్ ఎవరు? ప్లాన్ ఎలా డిజైన్ చేశారు.. అనే అంశాలు తెలియడాని కొంత సమయం పడుతుంది. కానీ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం…
ఒకే ఒక్క సినిమా.. అమ్మడి దశ, దిశను మార్చేసింది. ఫస్ట్ పార్ట్‌తో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. కెజీయఫ్ చాప్టర్ టుతో మాత్రం శ్రీనిధి శెట్టికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే అమ్మడు భారీగా డిమాండ్ చేస్తోందట. అయితే అసలు ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయా.. లేక కెజియఫ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పబ్లిసిటీ స్టంట్ అప్లై చేస్తోందా.. ఇంతకీ అమ్మడు ఎంత డిమాండ్ చేస్తోంది..? మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి.. ‘కేజీఎఫ్’ వంటి సెన్సేషనల్…
ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర రావు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇది సెట్స్ పై ఉండగానే ఎ. ఎం. రత్నం తన కుమారుడి దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించారు. ‘రూల్స్ రంజన్’ అనే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ మొదలైంది. ప్రముఖ దర్శకుడు…
ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన రామ్ చరణ్, శంకర్ సినిమా టైటిల్ గురించి… రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ కంప్టీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ గురించి గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు పుకార్లు తప్పితే.. శంకర్ టీమ్ నుంచి ఎలాంటి అఫిషీయల్ అప్టేట్ రాలేదు. కానీ చిత్ర వర్గాల సమచారం ప్రకారం.. అతి…
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో వుంటారు. తాజాగా ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ చీటింగ్ కేసు నమోదైంది. గతంలో శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వక పోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించాడు. అతనిపైన నేడు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు…
టాలీవుడ్ హీరోలలో మార్పు వస్తోందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం రావటం లేదు. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా టాలీవుడ్ వెలిగిపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ అదంతా మేడిపండు చందం అని కొట్టి పడేస్తున్నారు అనుభవజ్ఞులు. అసలేం జరుగుతోంది అంటే టాలీవుడ్లో ప్రస్తుతం అన్ని సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అనే నగ్నసత్యాన్ని బయటపెడుతున్నాయి. సూపర్ డూపర్ హిట్ అంటూ ఢంకా బజాయించి చెవులు హోరెత్తిస్తున్న సినిమాలు సైతం రియల్‌గా బాక్సాఫీస్ వద్ద…