Home
Tollywood
Tollywood News
-
ఈ యేడాది చివరిలో చిరు – బాబీ మూవీ సెట్స్ పైకి!
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బాలెన్స్ ఉన్న షూటింగ్ ను కాకినాడ పోర్ట్ లో దర్శకుడు కొరటాల శివ పూర్తి చేసి, అక్కడే గుమ్మడి కాయ కొట్టేస్తాడని అంటున్నారు. ఇదిలా ఉంటే… ‘లూసిఫర్’ మూవీ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ తేదీని చిరంజీవి ఖరారు చేశాడని తెలుస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ను ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా మొదలెట్టేశాడు. దర్శక నిర్మాతలు అధికారికంగా చెప్పకపోయినా ఆగస్ట్ 12న… -
మరో తమిళ హీరోతో రష్మిక రొమాన్స్
కోలీవుడ్‌లోని ప్రతిభావంతులైన హీరోలలో ఒకరైన శివకార్తికేయన్ చివరిసారిగా 2019లో “హీరో” చిత్రంలో తెరపై కనిపించారు. కరోనా వైరస్ మహమ్మారి రాకపోయి ఉంటే ప్రస్తుతం విడుదల కోసం ఎదురు చూస్తున్న ఆయన చిత్రాలు చాలా కాలం క్రితమే తెరపైకి వచ్చేవి. ఈ యంగ్ హీరో నటించబోయే ఆసక్తికరమైన ప్రాజెక్టుల విషయానికొస్తే “డాక్టర్”, “అయలాన్”, “డాన్” వంటి కొన్ని చిత్రాలను వరుసగా లైన్ లో పెట్టాడు. ఇది కాకుండా శివకార్తికేయన్ హీరోగా ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం రూపొందనుంది.… -
చిత్ర నిర్మాణంలో దూసుకుపోతున్న నారాయణ దాస్ నారంగ్
ప్రముఖ పంపిణీ దారుడు, నిర్మాత, ఎగ్జిబిటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్ టాలీవుడ్ లో నిర్మాతగా తన పట్టు బిగిస్తున్నారు. దాదాపు పది చిత్రాల నిర్మాణానికి ఆయన పూనుకున్నారు. కొన్ని సినిమాలను ఆయన సొంతంగానూ, మరి కొన్ని సినిమాలను భాగస్వాములతోనూ కలిసి నిర్మాణం జరుపుతున్నారు. విశేషం ఏమంటే… చిత్ర నిర్మాణంలో రాజీ పడకపోవడం తన నైజం అని తొలి చిత్రం ‘లవ్ స్టోరీ’తోనే నిరూపించారు నారాయణ్ దాస్ నారంగ్. పూర్తిగా… -
‘రాధేశ్యామ్’ తేదీకి వస్తున్న ఆ ఐదు చిత్రాలు!
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయి ఉంటే… ఈజూలై 30వ తేదీ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సందడి చేసి ఉండేది. కానీ అనుకున్నామని జరగవు అన్నీ అన్నట్టుగా… కరోనా సెకండ్ వేవ్ తో అందరి అంచనాలు తల్లకిందులై పోయాయి. అయితే అదృష్టం ఏమంటే… మూడు నెలలుగా మూతపడిన థియేటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. గత శుక్రవారం (23వ తేదీ) తమిళ డబ్బింగ్ సినిమా ‘నేరగాడు’ విడుదల కాగా…… -
‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుండి మరో అప్డేట్
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న కల్పిత కథ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేస్తోంది. అయితే..ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.… -
అనితరసాధ్యం అర్చన అభినయం!
నలుపు నారాయణుడు మెచ్చు అంటారు. నలుపుతోనూ వలపుగేలం వేయవచ్చుననీ కొందరు నిరూపించారు. నలుపున్నా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా గెలుపు చూసిన మేటి నటి అర్చన. ఎలా ఉంటేనేం? అర్చన అభినయంలో ఓ అందం ఉండేది. ఆ చూపుతోనే బంధాలు వేసే శక్తీ ఆమె సొంతమే! వాటిని మించి సుగంధాల వాసనలాంటి లావణ్యం అర్చనలో తిష్టవేసుకుంది. ఇన్ని లక్షణాలున్న తరువాత నలుపు, తెలుపుతో పనేంటి!? అర్చనను ‘బ్లాక్ బ్యూటీ’ అంటూ ఎందరో కీర్తించారు. వరుసగా రెండు సార్లు జాతీయ… -
కథల ఎంపికలో మేటి… దుక్కిపాటి!
ఎంత గొప్ప మేధావులైనా, జనం నాడి పట్టక పోతే లాభం లేదు – అంటారు. అసలు జనం నాడిని పట్టుకోవడమే పెద్ద విద్య! సదరు విద్యలో ఆరితేరిన వారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారే వరుస విజయాలు చూస్తారు. అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు అలాంటివారే! ఆయన దూరదృష్టి కారణంగానే, అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు అనిపించుకోగలిగారు. దుక్కిపాటి తమ ‘అన్నపూర్ణ’ పతాకంపై జనం మెచ్చే చిత్రాలు తెరకెక్కించి పదికాలాల పాటు జనం మదిలో నిలచిపోయారు. ‘తన… -
గళమే సాయికుమార్ బలం
(జూలై 27న నటుడు, నిర్మాత సాయికుమార్ బర్త్ డే) సాయి కుమార్ కంచు కంఠం అంటే తెలుగువారికే కాదు, కన్నడిగులకూ ఎంతో అభిమానం. సాయి కుమార్ గళం నుండి జాలువారే ప్రతిపదం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆయన గాత్రదానంతో ఎంతోమంది స్టార్స్ గా రాణించారు. అనువాద చిత్రాలకు సాయి గళం ఓ పెద్ద ఎస్సెట్. ఇక నటునిగానూ సాయి తనదైన బాణీ పలికించి జనాన్ని ఆకట్టుకున్నారు. పదహారేళ్ళ ప్రాయంలోనే బాపు తెరకెక్కించిన ‘స్నేహం’లో నటించిన సాయికుమార్ తరువాత… -
పాట ఎలా ఉండాలో చెప్పిన ఇళయరాజా!
కోట్లాదిమంది పెదాలపై మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఇప్పటికీ నాట్యం చేస్తూనే ఉంటాయి. వేయికి పైగా చిత్రాలకు స్వరాలు సమకూర్చిన ఇళయరాజా నేటికీ అలుపుసొలుపు లేకుండా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా పాట ఎలా ఉండాలో అలతి పదాలతో వివరించారు ఇళయరాజా. అప్పుడే వికసించిన కుసుమంలా పాట ఉండాలంటారు ఇళయరాజా. అంతేకాదు… ఆ పాటను ఎప్పుడు విన్నా… అదే అనుభూతి శ్రోతలకు కలగాలంటారు. ఆయన పాటలలో అలాంటి తాజాదనం ఉంది కాబట్టే దశాబ్దాలు గడిచిన ఆ పాటలను… -
జయంతి మృతికి బాలకృష్ణ సంతాపం
ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసి, ‘అభినయ శారద’గా పేరు తెచ్చుకున్న నటి జయంతి. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 500లకు పైగా సినిమాలు చేశారు. ఆమె మృతి పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నందమూరి బాలకృష్ణగారు మాట్లాడుతూ “జయంతిగారు గొప్ప నటి. అప్పటినుంచి ఇప్పటివరకూ అనేక తరాలతో కలిసి పనిచేసిన సీనియర్ నటీమణి. నాన్నగారి ‘జగదేకవీరుని కథ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై, తర్వాత ‘కుల గౌరవం’, ‘కొండవీటి సింహం’,…
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!