జూన్ 4న యస్.పి. బాలు జయంతి పురస్కరించుకుని సినీ మ్యుజీషియన్స్ యూనియన్ రవీంద్రభార తిలో ‘బాలుకి ప్రేమతో’ పేరుతో పాటల కచేరి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యం.ఎల్.ఏ రసమయి బాలకిషన్, పాటల రచయిత చంద్రబోస్‌తో హాజరయ్యారు. వీరితో పాటు సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షలు ఆర్.పి పట్నాయక్, అధక్షురాలు, నేపధ్యగాయిని విజయలక్ష్మీ, వైస్ ప్రెసిడెంట్ జైపాల్‌రాజు, జనరల్ సెక్రటరీ రామాచారి, ట్రెజరర్ రమణ సీలం, జాయింట్ సెక్రటరీ ఆర్. మాధవి, ఈసి మెంబర్ సింగర్ కౌసల్య, సంగీత దర్శకుడు వసంత్, కుంచె రఘు, శ్రీరామచంద్ర, గీతామాధురీ, శ్రీకృష్ణ, ఘంటాడి కృష్ణ, సింగర్ సందీప్, బిందు, వసంత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ‘శివరాత్రికి వేములవాడ జాతర చూశాను. ఆపై సమ్మక్క–సారక్క జాతర కూడా చూశా. ఇపుడు బాలు పుట్టినరోజు జాతరను రవీంధ్రభారతీలో చూస్తున్నా. బాలు గారి పాటలు వింటూనే పెరిగాను. తెలంగాణా రాష్ట్ర విభజన కోసం ఓ పాట పాడారు’ అన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ ‘నా మొదటిపాట బాలుగారే పాడారు. అలాగే నా మీద వస్తున్న పుస్తకానికి బాలుగారు ముందు మాట రాశారు. అందులో ‘ఆఖరి ముందుమాట’ అని రాసుకున్నాను. బాలు గారి విషయంలో మరణం మనిషికే కానీ, మంచితనానికి కాదు. సినీ మ్యుజీషియన్స్ యూనియన్‌కి నా వంతుగా కొంత ఆర్థిక సాయం అందిస్తున్నా’ అని ప్రకించారు. యూనియన్ గౌరవాధ్యక్షులు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ ‘బాలు గారంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. ఆయన పాటలాగా మనందరితో ఎప్పుడూ ఉంటాడు. నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తిప్రధాత బాలు’ అని అన్నారు.