ఏపీ సినిమా టికెట్ రేట్స్ ఇష్యూపై సినీ ప్రముఖులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆలీ, ఆర్ నారాయణమూర్తి .. జగన్ ని కలిసి ఇండస్ట్రీ సమస్యలను వివరించి పరిష్కారం కోరారు. ఇక ఈ మీటింగ్ కి చాలామంది స్టార్లు గైర్హాజరు అయినా విషయం తెల్సిందే. అందులో అక్కినేని నాగార్జున ఒకరు. నాగ్ ఈ భేటీకి రాకపోవడానికి కారణం…
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల పెద్దన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్ర సమయంలోనే తలైవా ఆరోగ్యం పాడవడం, ఆసుపత్రి పాలవ్వడం తిరిగి కోలుకోవడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉంది. దీంతో ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అధికారిక ప్రకటనను…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి జంటగా నటిస్తున్న చిత్రం వాలిమై. హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 24 న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే తమిళ్ లో ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ .. తాజాగా తెలుగులో కూడా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.…
యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ని బట్టి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని…
”పాండమిక్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదని, ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలే అవసరమని, ‘డీజే టిల్లు’ అలాంటి సినిమా’నే అని అన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మూవీ ఈ నెల 12న జనం ముందుకు వస్తున్న సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా…
బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో సీరియల్ ‘శక్తిమాన్’! ముఖేష్ ఖన్నా శక్తిమాన్ గా నటించిన ఈ ధారావాహిక దేశవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. పలుభాషలలో అనువాదమై చిన్నాలను అలరించింది. ఇప్పుడు సోనీ పిక్చర్స్ సంస్థ దీనిని మూడు భాగాల సినిమాగా నిర్మించబోతోంది. ఆ సీరియల్ ను సినిమాగా రూపొందించే హక్కులన్ని సోనీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. దేశంలోని ప్రముఖ సూపర్ స్టార్స్ లో ఒకరు శక్తిమాన్ గా వెండితెరపై కనిపించబోతున్నారని, ఓ ప్రముఖ…
గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య టిక్కెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న విషయం తెల్సిందే,. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యను నెత్తిమీద వేసుకున్న మెగాస్టార్ పరిష్కార మార్గం కోసం ఏపీ సీఎం జగన్ ని భేటీ అయ్యి సమస్యలపై చర్చించారు. ఇక నేడు ఇండస్ట్రీ పెద్దలతో కలిసి మరోసారి భేటీ అయ్యారు. సమస్యలను వివరించాం.. పరిష్కారం త్వరలోనే దొరుకుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ భేటీకి మంచు ఫ్యామిలీ హాజరు…
ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన యువ దర్శకుడు అనుదీప్ కె.వి.తో కలిసి పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా…
ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్న హీరోలందరికీ ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు అభినందనలు తెలిపారు. గురువారం సినిమా రంగానికి చెందిన అగ్ర కథానాయకులు, దర్శక నిర్మాతలు ఏపీ సీఎం జగన్ ను కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఓ పరిష్కారం కనుగొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి ఏపీకి ప్రత్యేకంగా వెళ్ళి ప్రాక్టికల్ ముఖ్యమంత్రి అనిపించుకున్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి, చిరకాల సమస్యలకు ఫుల్…
కలెక్షన్ కింగ్, డా. మంచు మోహన్బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో విష్ణు మంచు నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. చిత్ర కథానాయకుడు మోహన్బాబు అదనంగా దీనికి స్క్రీన్ప్లే బాధ్యతను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో గురువారం సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. 1.33 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో మోహన్ బాబు తనదైన శైలిలో సంభాషణలు చెప్పి మెప్పించారు. దర్శకుడు…