కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన చిత్రం వలిమై. హెచ్ వినోత్ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 24 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాలో అజిత్ సరసం బాలీవుడ్ బ్యూటీ హ్యూమా కురేష్ నటిస్తుండగా.. విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించాడు. గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా మారిన కార్తికేయ అందులో స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక వలిమై లో అజిత్ ని ముప్పుతిప్పలు పెట్టే విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి యాక్షన్ సీన్స్ ట్రైలర్ లో అదిరిపోయాయి.
ఇక తాజాగా అజిత్, కార్తికేయను పొగడ్తలతో ముంచేశాడట. కుర్ర హీరో అయినా అజిత్ కి ధీటుగా విలనిజాన్ని చూపడంతో ఈ స్టార్ హీరో కార్తికేయ నటనకు ఫిదా అయిపోయాడట. వలిమై సినిమా చూశాక అజిత్ స్వయంగా కోలీవుడ్ లోని కొంతమంది పెద్దల వద్ద కార్తికేయ నటనను పొగిడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ టాలీవుడ్ యంగ్ హీరో రేంజ్ కోలీవుడ్ లో అమాంతం పెరిగిపోయిందంట. మరి ఈ ఇద్దరి హీరోల పోటాపోటీ నటనను చూడాలంటే ఫిబ్రవరి 24 వరకు ఆగాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.