మాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ కమెడియన్ ప్రదీప్ కొట్టాయం గుండెపోటుతో కన్నుమూశారు. కేరళలో నివాసముంటున్న ఆయనకు బుధవారం అర్దరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ మరణ వార్త విన్న మాలీవుడ్ దిగ్బ్రాంతికి లోనైంది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారం ట్విట్టర్ వేదికగా ప్రదీప్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఇకపోతే ప్రదీప్ కొట్టాయం మలయాళంలో 70 కి పైగా సినిమాలలో నటించాడు. ఏ మాయ చేసావే చిత్రంలో సమంత మామయ్య జార్జ్ అంకుల్ గా తెలుగు వారికి సుపరిచితమే. ఇక రాజా రాణి చిత్రంలోన ప్రదీప్ కామెడీతో ఆకట్టుకున్నాడు.