కోలీవుడ్ డస్కీ బ్యూటీ అమలా పాల్ ఒకపక్క సినిమాలు, మరోపక్క ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది. ఇటీవల కుడి ఎడమైతే సిరీస్ తో తెలుగువారిని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. అంటే మరో రకంగా చెప్పాలంటే టాలీవుడ్ అమ్మడిని ఎవరు పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా అమలా రెమ్యూనిరేషన్ ఎక్కువ చెప్పడంతో అవి కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయట. ఇక తాజాగా అమలాపాల్ నాగార్జున సినిమాకు నో చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
నాగార్జున, ప్రవీణ్ సత్తార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఘోస్ట్. ఈ సినిమాలో నాగ్ సరసన కాజల్ నటించాల్సింది. కానీ ఆమె గర్భవతి కావడంతో ఆమె ప్లేస్ లో అమలాని అప్రోచ్ అయ్యారట మేకర్స్. ఈ ఆఫర్ ని అందిపుచ్చుకోకుండా అమలా రెమ్యూనిరేషన్ విషయంలో తగ్గేదేలే అని చెప్పుకొచ్చిందంట. దీంతో మేకర్స్ అంత ఇవ్వలేమని తెలుపుతూ అమ్మడిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నా సరసన నటించడానికి కుర్ర హీరోయిన్లు పోటీపడుతుండగా అమలా నో చెప్పడంతో .. ఈ హీరోయిన్ కి మాములుగా లేదుగా అని అందరు నోళ్లు నొక్కుకుంటున్నారట.