భీమ్లా నాయక్ తో పవన్ జాతర షురూ అయ్యింది. ఫిబ్రవరి 25 న ఈ సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటినుంచే పవన్ ఫ్యాన్స్ రచ్చ మొదలెట్టేశారు. ఇక సినిమా రిలీజ్ కి పది రోజులే ఉండడంతో ట్రైలర్ వేడుక, ప్రీ రిలీజ్ వేడుక, ఇంటర్వ్యూ లతో ఈ పది రోజులు భీమ్లా నాయక్ హవానే నడుస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికోసం ఈ రెండు ఓటిటీ లు బాగానే ముట్టచెప్పినట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాలన్నింటిని ఒడిసిపట్టి ప్రేక్షకులను తమ వైపు లాక్కుంటున్న స్టార్ మా భీమ్లా నాయక్ తో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. మరోపక్క ఆహా సైతం కొత్త కంటెంట్ లతో పాటు కొత్త సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. అయితే ప్రస్తుతం సినిమాలు రిలీజైన 15 రోజులు లేదా 30 రోజుల్లో ఓటిటీలో ప్రత్యేక్షమయిపోతున్నాయి. కానీ భీమ్లా నాయక్ మాత్రం రెండు నెలలు వరకు ఓటిటీ లో రిలీజ్ చేయకూడదని మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఫిబ్రవరి 25 న సినిమా రిలీజ్ అయితే.. ఏప్రిల్ వరకు ఈ సినిమా ఓటిటీ బాట పట్టదని తెలుస్తోంది. ఇక సినిమా సక్సెస్ అయ్యి భారీ వసూళ్లను నమోదు చేస్తే ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. పవన్- రానా మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు