రాజీవ్ సాలూరి, దీప ప్రధాన పాత్రలలో 11న ఓ కొత్త చిత్రం మొదలు పెడుతున్నారు నిర్మాత, దర్శకుడు సి వి రెడ్డి. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత సీవీ ఆర్ట్స్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారాయన. కరోనా కాలంలో కథను రెడీ చేసిన సీవీ రెడ్డి దీనికి ‘ఆఖరి ముద్దు’ అన్న పేరు నిర్ణయించారు. కథ తనని బాగా ప్రభావితం చేసిందని, సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యం తో ఈ సినిమా తీస్తున్నానంటున్నారు. గతంలో సీవీ రెడ్డి తెలుగు,…
బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ సరయుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సరయు అందులో బోల్డ్ వర్డ్స్, బోల్డ్ కంటెంట్ తో బాగా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక గతేడాది చివర్లో సరయు స్నేహితురాలు రాజన్న సిరిసిల్ల లో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసింది. ఆ రెస్టారెంట్ ప్రమోషన్ వీడియోలో సరయు తన అందచందాలతో ఆడిపాడింది. అయితే ఆ వీడియోలో గణపతి…
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన నాల్గవ చిత్రం ‘రాత్రి’. తొలీ సినిమా ‘శివ’తోనే తనదైన బాణీ పలికించిన రామ్, తరువాత అదే చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి అలరించారు. ఆ పై మూడో సినిమాగా ‘క్షణ క్షణం’ రూపొందించారు. నాల్గవ చిత్రం ‘రాత్రి’ని మాత్రం ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కించారు. ఈ హారర్ ఫిలిమ్ ద్వారానే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పరిచయం కావడం విశేషం. తొలి నుంచీ హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తన పనితనానికి…
ప్రస్తుతం టాలీవుడ్ కొన్ని సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గతకొన్నిరోజుల నుంచి ఏపీ లో టిక్కెట్ ధరల విషయమై చర్చ నడుస్తున్న విషయం విదితమే. ఏపీ ప్రభుత్వం ఏపీ టిక్కెట్ రేట్లు తగ్గించడంపై టాలీవుడ్ అసహనం వ్యక్తం చేయడం, పలువురు ప్రముఖులు ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని తెలపడం. ఇక వాటన్నింటిని ఆపడానికి ఇండస్ట్రీ పెద్దగా కాకుండా ఇండస్ట్రీ బిడ్డగా మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ ని కలవడం జరిగాయి. ఆ సమావేశంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన…
యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కథలను తెరకెక్కించడానికి నేటి తరం దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ అనే పేరులో ఓ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ‘పుంగనూరు – 500143’ అనేది ట్యాగ్ లైన్! ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్పై ఫోకస్ పెట్టారు మేకర్స్. ఈ నెల 14 ప్రేమికుల…
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 చిత్రం తెరకెక్కి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. భార్యల పోరును తట్టుకోలేని భర్తలుగా వెంకీ, వరుణ్ ల ఫ్రస్ట్రేషన్ ని వినోదాత్మకంగా చూపించిన అనిల్ ఈసారి ఎఫ్ 3లో ఇంకా వినోదాన్ని జోడించాడు. ఫన్ కి ఫ్రస్ట్రేషన్ కి డబ్బు ని కూడా జోడించి మరింత వినోదాన్ని పంచుతాను అంటున్నారు.ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28…
చిత్రపరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుకో స్టార్ కరోనా బారినపడుతున్నారు. తాజాగా సహజనటి జయసుధ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో అమెరికాలో చికిత్స తీసుకుంటున్న జయసుధ కొద్దిగా కోలుకున్నారని సంతోషపడేలోపు ఈ మహమ్మారి ఆమెను పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం జయసుధ హోమ్ ఐసోలేషన్ లో ఉంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక జయసుధ ఇటీవల సినిమాలకు దూరమైన సంగతి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ ని పూర్తి చేసిన పవన్ నెక్స్ట్ ‘హరిహర వీరమల్లు’ను ముంగించే పనిలో పడ్డాడు. ఇక దీని తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ ని మొదలుపెట్టనున్నాడు. గబ్బర్ సింగ్ తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడం వలన ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా…
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అనారోగ్యంతో భాదపడుతున్న విషయం తెల్సిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ముంబై హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్క ఆరోగ్య విషయమై చెల్లి ఆశా…