Dj Tillu: విశాఖలో ఘనంగా ‘డీజే టిల్లు’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘డీజే టిల్లు’. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ 4 సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో విశాఖ గురజాడ కళాక్షేత్రంలో బ్లాక్ బస్టర్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ, ”’డిజె టిల్లు’ మీకు ఇంత బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ నాకు చాలా ప్రత్యేకం. నా సక్సెస్ జర్నీ ఇక్కడి నుంచే మొదలైంది. నేను వేరే ఒక సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖలో ఉండగా ఈ సినిమా కోసం పిలుపు వచ్చింది. రాధిక పాత్రను నేను సరిగ్గా పోషించగలను అని నమ్మిన దర్శకుడు విమల్, నిర్మాత నాగవంశీ గారికి కృతజ్ఞతలు. ఇవాళ మీ రెస్పాన్స్ చూస్తుంటే రాధిక క్యారెక్టర్ లో మెప్పించానని అర్థమవుతోంది” అని అన్నారు. దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ, ”’డిజె టిల్లు’ చిత్రంతో మాకు గొప్ప విజయాన్ని అందించారు. మీరు ఇచ్చింది సక్సెస్ మాత్రమే కాదు, ఒక కొత్త జీవితం. ఓవర్సీస్ సహా మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” అని చెప్పారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ, ”మా 12 ఏళ్ల కల ఈ సాయంత్రం నిజమైంది. మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఆ సినిమాలతోనే అనుకున్నది సాధించాలని అనుకున్నాం. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా చేసి ఓటీటీలో రిలీజ్ చేశాం. అ తర్వాత ‘మా వింతగాథ వినుమా’ సినిమా చేస్తే ఫర్వాలేదన్నారు. ఇప్పుడు ‘డిజె టిల్లు’ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ జర్నీలో నేను థాంక్స్ చెప్పుకోవాలనుకునే వ్యక్తి మా నిర్మాత వంశీ అన్న. మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చారు. మా తలరాత మేమే రాసుకోవాలని చేపట్టిన మా కలం, బలం ఇవాళ విజయం సాధించాయి. ఎన్ని పాండమిక్ లు, తుఫాన్ లు వచ్చినా మీకు నచ్చే సినిమాలు చేయాలనే మా ప్రయత్నాలు ఆపం” అని అన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!